Select Location
Newsread Image

No.1 Short News

Shaida Reporter
రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
View More
Entertainment
08 Feb 2025 12:16 PM
0
50
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన
రాజ్ తరుణ్ భార్య అని చెప్పుకుంటున్న లావణ్య... మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందించిన సంగతి తెలిసిందే. ఆ హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఆమె మాట్లాడుతూ... హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు కూడా అందులో ఉన్నాయని తెలిపింది. ఈ విషయం సంచలనంగా మారింది. ఈ అంశంపై నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవి 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అని తెలిపారు. వీడియోలో ఉన్నది తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. వాస్తవం ఏమిటనేది పోలీసులకు కూడా తెలుసని అన్నారు.
View More
Entertainment
08 Feb 2025 10:41 AM
0
49
Newsread Image

No.1 Short News

Shaida Reporter
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాకు మరిన్ని చిక్కులు.. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని శేఖర్ బాషా ఆరోపించాడు. ఈ క్రమంలో శేఖర్ బాషాపై లావణ్య కేసు పెట్టింది. ఓవైపు ఇది జరుగుతుండగానే... బాషాపై మరో కేసు నమోదయింది.శేఖర్ బాషాపై మహిళా అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ శ్రేష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కూడా శ్రేష్టి వర్మ కావడం గమనార్హం.
View More
Entertainment
06 Feb 2025 18:11 PM
0
39
Newsread Image

No.1 Short News

Shaida Reporter
హాట్ స్టార్ లో రొమాంటిక్ కామెడీ సిరీస్!
మలయాళ కథలకు సినిమాల వైపు నుంచి ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీవైపు నుంచి మలయాళ సిరీస్ లకు అంతే డిమాండ్ ఉంది. అందువలన మలయాళ కంటెంట్ వివిధ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న వెబ్ సిరీస్ గా 'లవ్ అండర్ కన్ స్ట్రక్షన్' కనిపిస్తోంది.
View More
Entertainment
05 Feb 2025 16:29 PM
0
39
Newsread Image

No.1 Short News

Shaida Reporter
పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీలను ప్రారంభించిన అపోలో ఫౌండేషన్
అపోలో హాస్పిట‌ల్స్ అధినేత డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అపోలో ఫౌండేషన్ తాజాగా ఏపీలోని పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీలను ప్రారంభించింది. త‌ద్వారా అపోలో ఫౌండేషన్ సమాజ సంక్షేమంలో ఒక గొప్ప అడుగు వేసింది. ఇక అపోలో ఫౌండేషన్ ఈ మోడల్ అంగన్‌వాడీల ద్వారా తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, చిన్ననాటి సంరక్షణలో మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో హాస్పిట‌ల్స్ చొర‌వ ప‌ట్ల పిఠాపురం ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చొరవతో పిఠాపురం అభివృద్ధిలో ముందుకెళ్తోందని వారు చెబుతున్నారు.
View More
Entertainment
05 Feb 2025 16:16 PM
0
27
Newsread Image

No.1 Short News

Newsread
6 కోట్ల బడ్జెట్ .. 75 కోట్ల వసూళ్లు: మలయాళ మూవీ రికార్డ్!
థియేటర్లలోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 25 రోజులలో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సిద్ధిఖీ .. జగదీశ్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో, మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం.
View More
Entertainment
05 Feb 2025 15:39 PM
0
29
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
తండెల్ సినిమా టికెట్ పెంపు పై ఆంద్రప్రదేశ్ లో క్లారిటీ
తండేల్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం
View More
Entertainment
05 Feb 2025 10:57 AM
0
19
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కన్నప్ప' సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్... అదిరిపోయిందిగా!
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. 'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
View More
Entertainment
03 Feb 2025 12:20 PM
1
17

No.1 Short News

Newsread
ప్రపంచంలో అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఇదే
ఫుట్బాల్ తో స్టెండ్స్ చేసే కేరళకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఓ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి పర్ఫెక్ట్ గా రాళ్ల మధ్యలోకి వెళ్లేలాగా తన్నాడు. ఈరియల్ను ఆయన ఇన్స్టాల్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది ఈ రీల్ కు ఏకంగా 554 మిలియన్ల 55.4 కోట్ల వ్యూస్ రాగా 84 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.
View More
Entertainment
22 Jan 2025 00:35 AM
3
48
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel