గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దర్శి సీఐ & ఎస్సై.
దర్శి: ఈరోజు మోడల్ స్కూల్ లో దర్శి సీఐ మరియు ఎస్ఐ విద్యార్థులతో ముచ్చటిస్తూ చదువు జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన ఆయుధమని, చదువుకోవడం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారని, విద్యార్థి దశలోనే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని, అలాగే ఈ వయసులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అపరిచితులను నమ్మొద్దని, ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలని తెలిపారు.