ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజులు కుండపోత వానలు.. పిడుగులు పడే ప్రమాదం..!
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.