ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్త డిఫినేషన్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ, వారిని అవమానించేలా మాట్లాడారు. “ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యంగా మాట్లాడేవాడు ‘జర్నలిస్ట్’ అనే ముసుగుతో సోషల్ మీడియాలో అందరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు” అని రేవంత్ వ్యాఖ్యానించారు