Select Location
Newsread Image

No.1 Short News

Newsread
వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు సులబంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఆహరం కూడా. అందుకే, వర్షాకాలంలో తీసుకునే ఆహరం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను, కూరగాయలను ఈ వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటి? వాటిని ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో తినకూడని కూరగాయలు: 1.బీరకాయ, సొరకాయ: ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి. అలాగే బాక్టీరియా, ఫంగస్ త్వరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రకం కూరగాయల్లో ఏది మంచిది. ఏది పాడైంది అని గుర్తించడం చాలా కష్టం. అందుకే వర్షాకాలంలో ఈ కూరగాయలను తక్కువగా తీసుకోవడం మంచిది. 2.ముల్లంగి: ముల్లంగి భూమిలోపల పెరిగే కూరగాయ. వర్షాకాలంలో ఇలా మట్టి నుంచి వచ్చే కూరగాయల్లో సూక్ష్మజీవులు, బాక్టీరియా, పరాన్నజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన శరీరంలో చేరి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. 3.పచ్చి కూరగాయలు: వర్షాకాలంలో పచ్చిగా ఉండే కూరగాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీరు, తడి వాతావరణం వల్ల బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మ సమస్యలకు కారణం కావచ్చు. 4. ఆకు కూరలు: నిజానికి మనిషి ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. కానీ, వర్షాకాలం మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, ఈ కాలంలో ఆకు కూరలపై మట్టితో పాటు ఫంగల్ స్పోర్లు ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. సరిగ్గా శుభ్రపరచకపోతే వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు. అయినా సరే తినాలని అనుకుంటే మాత్రం బాగా ఉడికించి తినాలి. 5.మష్రూమ్స్: ఇవి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇవి చాలా త్వరగా పాడవుతాయి. వాటిని గుర్తించకపోవడం వల్ల అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలం మష్రూమ్స్ తినడం మంచిది కాదు. కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీటి శాతం తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. బాగా ఉడికించి లేదా వేడిగా ఉండే ఆహారంగా తీసుకోవాలి. రంగు మారిన కూరగాయలు తినకూడదు. వర్షాకాలంలో శరీరం సహజంగానే కొంత బలహీనంగా ఉంటుంది. పైగా తడి వాతావరణం, వైరస్‌లు, బ్యాక్టీరియా అనారోగ్యాలకు గురి చేస్తాయి. అందుకే కొన్ని కూరగాయలు తినడాన్ని తాత్కాలికంగా నివారించడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది.
View More
Latest News
30 Jun 2025 13:56 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
ఇక మొబైల్ యాప్తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్లో అమలు
బీహార్ : కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు.
View More
Latest News
29 Jun 2025 23:25 PM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా అబ్బాస్
రాష్ట్ర ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా నన్ను నియమించి నియామక పత్రం అందజేసిన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జనాబ్ షేక్ ఖలీల్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేశారు. ముస్లింల అభివృద్ధి కోసం రాజకీయ పార్టీ లకు అతీతంగా అందరం కలిసి నిరుపేద మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులకు మేలు జరగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుదాం అని తెలిపారు.
View More
Latest News
29 Jun 2025 23:16 PM
1
14
Newsread Image

No.1 Short News

Newsread
District - Level initiative To Identify And Admit Out Of School Children
Prakasm District Collector : Tameem Ansariya Conducted District Level Meeting on Bangaru Balyam and Reviewed the Enrolment Drive-2025 to identify out-of-school children and admit them to suitable classes. Officials were asked to conduct door-to-door surveys, awareness rallies, and focus on SC, ST student admissions. The drive must be completed by July 12.
Latest News
29 Jun 2025 21:30 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
భక్తులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం! - తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం సుమారు 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి వంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి, ఆకస్మిక గుండెపోటుకి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి టీటీడీ 3లక్షల రూపాయల వరకు చెల్లిస్తోంది. ఇప్పుడు అలిపిరి - తిరుమల మధ్య ప్రయాణించే భక్తులకు బీమాను కల్పించాలని చూస్తున్నారు. పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమదారుల్లో తిరుగుతుండగా, మరో 350 బస్సులు విడతలవారీగా రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవా స్కీమ్​ కింద కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 750 విద్యుత్తు బస్సులు కేటాయించింది. ఇందులోంచి 50 బస్సులు ‘తిరుమల- తిరుపతి’ కేటాయించారు. ఇవి కాకుండా తిరుమలకు మరో 300 బస్సులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా, అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది. మొదటి దశలో కేంద్రం ఇచ్చే 50 బస్సులను మంగళం డిపోనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రానున్న 300 బస్సుల్లో తిరుమల డిపోనకు 150, అలిపిరి డిపోనకు 50, తిరుపతి ఇంట్రా మోడల్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా కేటాయించే డిపోనకు 50, శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య మరో 50 బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తిరుమలలో 150 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్‌ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు వీలుగా 5 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు
View More
Latest News
29 Jun 2025 19:23 PM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.
కేంద్రం అనుమతి ఉంటేనే రాష్ట్రాల్లో ట్యాపింగ్. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. 30 రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త ప్రతిపాదనలు. రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అధికారాలపై పరిమితులు. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్‌లు ట్యాప్ చేయాలంటే ఇకపై కేంద్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ట్యాపింగ్ అధికారం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం. కేంద్ర హోంశాఖ అనుమతి ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్.
View More
Latest News
29 Jun 2025 19:17 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జూలై 9 సమ్మె ప్రచార సామాగ్రి దొనకొండలో ఆవిష్కరణ
1.కార్మికులు బిట్రిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి. 2.మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. 3.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధరల చట్టం చేయాలి. 4.కార్మికులకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి. 5.వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం పనికి రోజుకి 600 రూపాయలు అమలు చేయాలి. 6.నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. 7.ప్రభుత్వ రంగ సంస్గల ప్రవేటికరణ చేయడం ఆపాలి.
View More
Latest News
29 Jun 2025 16:09 PM
1
19
Newsread Image

No.1 Short News

Newsread
Girl raped after being drunk
AP: Girl raped after being given alcohol. This brutal incident came to light late in Prakasam district's Komarolu mandal. A woman from Giddalur and Kane Chandrasekhar from Chennupalle in Kadapa district were having an extramarital affair. In this process, the woman brought her relative, an 11-year-old girl, to a closed restaurant. Chandrasekhar, who was already there, made the girl drink alcohol and raped her. The girl's mother filed a complaint with the police.
View More
Latest News
29 Jun 2025 14:44 PM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ లో కలకలం సృష్టించిన నకిలీ ఈ-స్టాంపుల కేసు స్కామ్‌లో-ముగ్గురిపై కేసు
కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన నకిలీ ఈ-స్టాంపుల స్కామ్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసి విక్రయించాడని ఎస్పీ తెలిపారు. నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఫిర్యాదు మేరకు బోయ ఎర్రప్ప, మోహన్‌బాబు, భువనేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మీసేవ నిర్వహకుడు బోయ ఎర్రప్ప రెండేళ్లుగా 15, 413 స్టాంపులు విక్రయిస్తున్నట్లు నిర్దారించామన్నారు. వీటిలో ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాకు 438 ఈ-స్టాంపులు ఇచ్చారని తెలిపారు. ఈ-స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా రూ.32 లక్షలు బదిలీ చేయగా, అందులో రూ.25.48 లక్షలు కాజేసి ఆ మొత్తానికి నకిలీ ఈ-స్టాంపులు ఇచ్చాడని ఎస్పీ తెలిపారు.
View More
Latest News
29 Jun 2025 14:04 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
Telangana Govt Grant Pensions to HIV Victims, Minister Seethakka Announces
TG: Minister Seethakka said on Saturday that new pensions will be granted to HIV victims in the state soon. He said that so far 36 thousand HIV victims in the state are receiving pension. Including the new ones, more than 50 thousand people will receive financial assistance. He said that more than 13 thousand applications are under consideration, they will be verified and sent to the Finance Department. He said that pensions will be granted as soon as they are approved.
View More
Latest News
29 Jun 2025 12:16 PM
0
20
Newsread Image

No.1 Short News

Newsread
బిగ్ బాస్ 9లోకి వెళ్లాలని ఉందా.. అప్లై చేసుకోండిలా
బిగ్బాస్-9 కోసం 'కాల్ ఫర్ ఎంట్రీస్' పేరుతో ఆసక్తికర వీడియోను విడుదల చేసింది బిగ్బాస్ టీమ్. ఈసారి సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియన్స్కు కూడా హౌస్లోకి ఎంట్రీ ఛాన్స్ ఉందని నాగార్జున ప్రకటించారు. బిగ్బాస్ను ప్రేమించే ప్రేక్షకులకు ఇది రిటర్న్ గిఫ్ట్ అంటూ పేర్కొన్నారు. రిజిస్టర్ అయి, బిగ్బాస్లోకి రావాలన్న కారణాన్ని చెప్పే వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. https://bb9.jiostar.com
View More
Latest News
29 Jun 2025 09:03 AM
0
16
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
కరవాది గ్రామానికి చెందిన యువతికి కేంద్ర న్యాయశాఖ లో ఇంటర్న్ షిప్ అవకాశం
ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం ఒక చిన్న గ్రామం కరవది నుంచి వచ్చిన విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో 5 వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని సత్యాల అంజన్ భారత ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం (Department of Legal Affairs) నిర్వహించే జూలై 2025 నెల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములో ఎంపికయ్యారు. ఈ ఇంటర్న్‌షిప్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూ ఢిల్లీలో జులై 1 నుండి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు కాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈమె ఎంపిక అయ్యారు. ఇది అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పని చేసే అరుదైన అవకాశం కావడం విశేషం. విద్యార్థిని తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక పోటీదారులను అధిగమించి ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ అవకాశాన్ని ఆమె తన భవిష్యత్ న్యాయ ప్రస్థానానికి ఒక మైలురాయి గా భావిస్తున్నారు..
View More
Latest News
28 Jun 2025 18:48 PM
3
23
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్ర ప్రభుత్వ అతిధి గా మౌలానా అసద్ మదిని కి స్వాగతం పలికిన ఫారూఖ్ షుబ్లీ
ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి NMD ఫరూఖ్ సూచనల మేరకు జమియత్ ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు హజ్రత్ మౌలానా మహమూద్ అసద్ మదని ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలకటం జరిగింది. మౌలానా హుస్సేన్ , ముఫ్తీ ఇలియాజ్ కూడా ఉన్నారు.
View More
Latest News
28 Jun 2025 16:28 PM
1
20
Newsread Image

No.1 Short News

Newsread
RNI లేని పత్రికలపై వేటు..ఇక పై చర్యలు
TEL నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి... PRGI కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు .. త్వరలో జిల్లా DPRO లకు ఉత్తర్వులు. PRESS REGISTRAR GENERAL OF INDIA ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని RNI లేని పత్రిక లు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పి డి ఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్,PRGI. న్యూ ఢిల్లీ అప్పీలు చేయగా ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి RNI లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు RNI లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీచేసింది దీని గమనించి రాష్ట్ర జిల్లా పౌరసంబంధాల అధికారులు పరిగణించాలని ఆర్ ఎన్ ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సదరు జిల్లా పౌరసంబంధాల అధికారులు సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేశారు.
View More
Latest News
28 Jun 2025 15:08 PM
4
24
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు
కొత్త ఎలక్ట్రిక్ SUV YU7 లాంచ్ అయిన వెంటనే సంచలనం సృష్టించింది. కేవలం 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు నమోదు చేసింది. మొదటి గంటలోనే 3 లక్షల యూనిట్లు బుక్ చేసుకున్నారు. ఈ కారు 835 కి. మీ పరిధి, 690 PS పవర్, 15 నిమిషాల్లో 620 కి. మీ ఛార్జింగ్ సామర్థ్యం దీనిని చాలా ప్రత్యేకంగా చేసింది. స్టైలిష్ ఇంటీరియర్స్, హై-టెక్ ఫీచర్లు, గొప్ప భద్రతా వ్యవస్థలతో ఈ SUV టెస్లాకు గట్టి పోటీని ఇస్తోంది.
View More
Latest News
27 Jun 2025 22:45 PM
0
31
Newsread Image

No.1 Short News

Newsread
కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? జూలైలో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నథింగ్ నుంచి శాంసంగ్ వరకు..!
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? జూలై మొదటి వారంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. నథింగ్ నుంచి శాంసంగ్ వంటి బ్రాండ్ల నుంచి సరికొత్త ఫోన్లు (Upcoming Smartphones) లాంచ్ కానున్నాయి. అద్భుతమై ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3, వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE వంటి ఫోన్ల ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. జూలైలో వచ్చే ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. నథింగ్ ఫోన్ 3 : భారత మార్కెట్లో ఈ నథింగ్ ఫోన్ వచ్చే జూలై 1, 2025న లాంచ్ కానుంది. లీకైన నివేదికల ప్రకారం.. 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌‌లో 5,150mAhతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 5 : ఈ వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ ఫోన్ జూలై 8, 2025న లాంచ్ కానుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, ఈ హ్యాండ్‌సెట్ 6.83-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా క్వాలిటీ కోసం 50MP + 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP కెమెరాతో రానుంది. బ్యాటరీ బ్యాకప్ కోసం 5,200mAh సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3తో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE : వన్‌ప్లస్ నార్డ్ 5తో పాటు కంపెనీ ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ CE5 కూడా లాంచ్ చేయబోతోంది. జూలై 8న వన్‌ప్లస్ నార్డ్ CE లాంచ్ కానుంది. కొన్ని లీక్‌లతో అనేక స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు.ఈ ఫోన్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP + 8MP కెమెరా ఇవ్వవచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాతో రావచ్చు. పవర్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350తో కూడా రావచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z సిరీస్ : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్లను కూడా జూలై 9న లాంచ్ చేయనుంది. ఈ 2 ఫోన్‌లను అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 8-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 6.5-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండొచ్చు. 4,400mAh బ్యాటరీతో వస్తుంది. అదే సమయంలో, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అందుబాటులో ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్‌తో 3 స్టోరేజ్ వేరియంట్‌లలో 256GB, 512GB, 1TBతో రావచ్చు. మొత్తం 3 కెమెరాలలో 200MP ప్రైమరీ కెమెరా కూడా ఉండొచ్చు.
View More
Latest News
27 Jun 2025 12:16 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
ఫారూఖ్ షుబ్లీ కి ప్రత్యేక షెర్వానీ బహుకరణ
ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి బ్రదర్ హుడ్ సభ్యులు విచ్చేసి జూలై 20వ తేదీన నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ ని ఆహ్వానిస్తూ తన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన షేర్వానీని ప్రేమగా కానుకను అందించారు.
View More
Latest News
27 Jun 2025 01:49 AM
0
29
Newsread Image

No.1 Short News

Newsread
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది డాక్టర్:గొట్టిపాటి లక్ష్మీ
దర్శి మండలం, తూర్పు వీరయపాలెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మొక్కలు నాటారు. చంద్రన్న - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్ష్మి మొక్కలను నాటి మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో మొక్క నాటుకొని భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన సమాజం అందించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం ద్వారా పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ద్వారా మన ఆరోగ్యం మనమే పరిరక్షించుకోవచ్చని ఆమె వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, పరిటాల సురేష్, గుర్రం బాలకృష్ణ, తూర్పు వీరయపాలెం గ్రామ ప్రజలు ఉన్నారు.
View More
Latest News
26 Jun 2025 15:54 PM
0
42
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
శివరామపురం లో మాజీ ఎంపీటీసీ తండ్రిని పరామర్శించిన గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్.
తాళ్లూరు మండలం, శివరాంపురం గ్రామంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ గాడిపత్రి లక్ష్మీనారాయణ తండ్రిగారిని పరామర్శించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టపాటి లక్ష్మీ & టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి మండలంలోని హోదాలో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
26 Jun 2025 14:21 PM
3
34
Newsread Image

No.1 Short News

Newsread
నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతుల అరెస్ట్
HYDలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ జంట తమ నగ్న వీడియోలను ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రికార్డెడ్ వీడియోకు రూ.500, లైవ్ స్ట్రీమింగ్ కోసం రూ.2000 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓ కానిస్టేబులు విషయం తెలియగా, ఆయన ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో వారింటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు.
View More
Latest News
26 Jun 2025 13:19 PM
2
63
Newsread Image

No.1 Short News

Newsread
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజులు ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
AP Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
View More
Latest News
26 Jun 2025 09:26 AM
0
25
Newsread Image

No.1 Short News

Newsread
11 Missing After Bus Falls Into Alakananda River In Uttarakhand's Rudraprayag
At least one person has died and 10 others are missing after a bus with 18 passengers onboard fell into the Alakananda river in Uttarakhand's Rudraprayag district. Seven people have been rescued, as the police and the State Disaster Response Force are conducting relief work.
Latest News
26 Jun 2025 09:09 AM
0
21
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
దర్శి అభివృద్ధికై జిల్లా కలెక్టర్ తో గొట్టిపాటి లక్ష్మీ భేటీ
దర్శి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డా గొట్టిపాటి లక్ష్మీ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తో భేటీ అయ్యారు.నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. దర్శి గవర్నమెంట్ స్కూల్లో ఫ్లోరింగ్, ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరమ్మత్తులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మి కోరారు. తాళ్లూరు బాలికల హాస్టల్ వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు అనుసంధానంగా వెస్ట్ వీరాయపాలెం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై కలెక్టర్ గారితో డాక్టర్ లక్ష్మి చర్చించారు. వీటన్నింటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మి వివరించారు.
View More
Latest News
25 Jun 2025 22:12 PM
2
31
Newsread Image

No.1 Short News

Newsread
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో మాట్లాడిన మైనారిటీ లీడర్ షంషీర్.
ప్రకాశం జిల్లా ఒంగోలు లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షైక్ సైదా పార్టీ శ్రేణులతో పార్టీ బలోపేతానికి తగినసూచనలు సలహాలు, ప్రస్తుత రాజకీయ ల పై చర్చ జరిగినది.ఇందులో పాల్గొన్న ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ షంషీర్ మాట్లాడుతూ ముస్లింలు ఒక్కప్పుడు రాజ్యాలు పరిపాలించారని ఇప్పుడు అన్ని రంగాలలో వెనుక పడి ఉన్నారు అని విద్య వైద్య ఆర్థిక రాజకీయాలలో చాలా వెనక బడి ఉన్నారు అని, కొన్ని చోట్ల కుల వివక్ష కూడా ఎదురుకుంటున్నారు అని .కలిసి మెలిసి ఉండే భారత దేశంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ కుల వివక్ష ను మతోన్మాదాన్ని త్వరగా నియంత్రించ కుంటే భవిషత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
View More
Latest News
25 Jun 2025 07:18 AM
3
94
Newsread Image

No.1 Short News

Newsread
ఆదోని: పాము కాటుతో 8 ఏళ్ల బాలుడు అభిరామ్ మృతి – ఇంద్రనగర్‌లో విషాదం
ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ ఎరుకల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుడైన 8 ఏళ్ల బాలుడు అభిరామ్ విషపూరిత పాము కాటుతో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం స్కూల్‌ నుండి వచ్చి ఇంట్లో భోజనం చేస్తుండగా ఏదో కాటేసినట్లు అనిపించడంతో తల్లికి తెలియజేశాడు. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అభిరామ్‌ను ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అభిరామ్ ఇప్పటికే మృతి చెంది ఉన్నట్లు నిర్ధారించారు. డ్యూటీ డాక్టర్ సమాచారం అందజేయడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి పెద్దనాన్న మీడియాతో మాట్లాడుతూ,ఇంద్రనగర్ కాలనీలో కాలువలు, మురుగునీటి డ్రెయిన్లు అపరిశుభ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణం.ఎమ్మెల్యే అధికారులు, వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలి. మా కుటుంబానికి జరిగిన విషాదం మరెవరినీ తాకకూడదని కోరుకుంటున్నాం అని వివరించారు.
View More
Latest News
24 Jun 2025 23:05 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
Jahnavi Selected as an Astronat Candidate For 2029 Orbital Mission
Jahnavi Dangeti, hailing from Palakollu, West Godavari district in Andhra Pradesh, has been officially selected as an Astronaut Candidate (ASCAN) for the prestigious Titans Space Astronaut Class of 2025. This significant announcement paves the way for Dangeti to participate in Titans Space's inaugural orbital mission, currently slated for March 2029. As an astronaut candidate with Titans Space, Jahnavi will undergo a comprehensive three-year training program in the United States, meticulously preparing her for the 2029 orbital flight. This mission, which will see her spend five hours in space, will be led by seasoned American astronaut Bill MacArthur. Jahnavi Dangeti's inclusion in their pioneering space launch team underscores her vital role in shaping the future of private space exploration and India's growing footprint in the cosmos.
View More
Latest News
24 Jun 2025 22:42 PM
1
36
Newsread Image

No.1 Short News

Newsread
రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి!
ట్రైన్‌ టికెట్‌ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. జులై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి......
Latest News
24 Jun 2025 20:24 PM
0
29
Newsread Image

No.1 Short News

Newsread
అనిశా కు దొరికిన మరో అవినీతి తిమింగలం..
ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- (ఇతపూర్వమే రూ.5000/- తీసుకున్నది) లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్, అంబర్ పేట, గోల్నాక, నెహ్రూ నగర్, వార్డ్ నంబర్ -2 లోగల GHMC కార్యాలయం లోని సహాయక ఇంజనీరు - శ్రీమతి టి. మనీషా. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
View More
Latest News
24 Jun 2025 16:49 PM
2
40
Newsread Image

No.1 Short News

Kumar Darla
నేటి సాయంత్రం ఒంగోలుకు షర్మిలమ్మ రాక
ఒంగోలులోని పిఎన్జి కన్వెన్షన్ సెంటర్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వైఎస్ షర్మిలమ్మ రానున్నారు ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు . ఆమెకు స్వాగతం పలికేందుకు జిల్లాను ఇలా ముస్తాబు చేశామని షేక్ సైధా చెప్పారు. జిల్లా సమస్యలపై షర్మిలమ్మ ఏం మాట్లాడుతారో తెలియాల్సి ఉంది.
View More
Latest News
24 Jun 2025 14:56 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
ఇరాన్ దెబ్బ కి తోక ముడిచిన ఇజ్రాయెల్, అమెరికా.
ఎదుటివారు మౌనంగా ఉన్నంత సేపు ప్రతి వెధవ తోపు, తురుము అని విర్రవీగేవాడే..ఒక్కసారి మౌనం వీడి ఎదురు తిరిగితే, ఎంతటి వాడైనా హిజడలా వలె వెన్ను చూపి పారి పోవాల్సిందే...ఎదుటివారు మౌనంగా ఉన్నంత సేపు ప్రతి వెధవ మగాడే మౌనం వీడి ఎదురు తిరిగితే హిజడలా వలె వెన్ను చూపక తప్పదు ఎవడైనా. ఇజ్రాయెల్, అమెరికా తల బిరుసు తనానికి సరిగ్గా సమాధానం చెప్పిన ఇరాన్ మౌనం వెనక వున్న శక్తి కి నిదర్శనం.
View More
Latest News
24 Jun 2025 13:58 PM
1
36
Newsread Image

No.1 Short News

Kumar Darla
విరిగిన పాలు..పోలీసులకు ఫిర్యాదు
విరిగిన పాలు.. పోలీసులకు ఫిర్యాదు! కూకట్పల్లిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొన్న హెరిటేజ్ పాలు విరిగిపోవడంతో, వినియోగదారుడు ఈ. రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో, నాసిరకం వస్తువులు అమ్ముతున్నారంటూ సూపర్ మార్కెట్ యజమాని, మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
View More
Latest News
24 Jun 2025 11:49 AM
4
45
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా అబ్దుల్ షంషీర్ సౌదాగర్
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా.. జనాబ్ అబ్దుల్ షంషీర్ సౌదాగర్ (మార్కాపురం పట్టణవాసి) ను నియమిస్తూ అపాయింట్మెంట్ లెటర్ అందిస్తున్న. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా. అబ్దుల్ షంషీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు మల్లికార్జున్ ఖర్గే కి రాహుల్ గాంధీ కి ఇమ్రాన్ ప్రతాప్ కి మరియు AP అధ్యక్షురాలు షర్మిలమ్మ కి మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ దాదాగాంధీ కి ప్రకాశం జిల్లా డిసిసి షేక్ సైదా కి మరియు జాతీయ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా బేగం కి పార్టీ నాయకులకు కాంగ్రెస్ పెద్దల అందరికీ ధన్యవాదములు తెలుపుతూ నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు విధేయుడు నై ఉండి ఈ పార్టీ పూర్ణ వైభవం తెచ్చుకునేందుకు నా శాయశుక్తుల కృషి చేస్తా అని తెలిపారు.
View More
Latest News
23 Jun 2025 22:09 PM
1
52
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో వైయస్సార్ కాలనీ పరిస్థితి చాలా ప్రమాదగా మరిది
బీర్కూర్ లో వైయస్సార్ కాలనీ పరిస్థితి చాలా ప్రమాదగా మరిది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కేద్రం లోని వైయస్సార్కాలనీ లో చాలా అడవి ప్రమాదగా మరిది కానీ అధికారులకు చేపిన కూడా పట్టిచుకోవడం లేదు కాలనీ వాసులు చాలా సార్లు చెప్పారు కానీ గండి మందు కొడుతాను అన్ని చెప్పారు కానీ ఇంపటి వరకు ఇక ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు మరి ఏంటో కాలనీ పరిస్థితి ఇలా ఉంది అన్ని ఒక ప్రజా వాణి రిపోర్టర్ చేపిన కూడా పట్టిచుకోవడం లేదు అంటే కూడా పట్టిచుకోవడం లేదు కాలనీ వాసులు చెపుతే ఇంకేం పట్టిచుకుంటారు మరి ఒక రోడ్లు కూడా ఇంపటివరకు వేయలేక పోతున్నారు వర్ష కాలంలో చాలా ఇంటి చుట్టు పక్కల కూడా చాలా మురికి నీళ్లు అలాగే నిలిచిపోతున్నాయి ఈ వైయస్సార్ కాలనీ తొందర్లో పూర్తి చేయాలనీ కాలనీ వాసులు చెపుతున్నారు ఒక రిపోర్టర్ చేపిన కూడా పట్టిచుకోవడం లేదు అంటే మిరే అర్ధం చేసుకోవాలి దయచేసి నిన్ను నాకోసం చెప్పడం లేదు నిన్ను చెప్పేది వైయస్సార్ కాలనీ ప్రజల కోసం చెపుతున్నాను కొంచెం అర్ధం చేసుకొని పని పూర్తి చేయాలనీ కోరుతున్నారు పాములు వస్తున్నాయి కానీ అధికారులు పట్టిచుకోవడం లేదు ఎందుకో మరి అధికారులకు ఎల్లా అర్ధం అవుతుందో మరి మోరీలు కూడా లేవు ఇంపటి వరకు అధికారులు వచ్చి చుస్తే తెలుస్తుంది కాలనీ పరిస్థితి రాత్రి సమయం లో బయటకు వేళలంటే భయకారాగా ఉంది చెట్లు పోదాలు చాలా అలానే ఉన్నాయి తొందరగా ఈ కాలనీ పూర్తి చేయాలనీ కాలానివాసులు కోరుతున్నారు
View More
Latest News
23 Jun 2025 20:25 PM
2
55
Newsread Image

No.1 Short News

Newsread
ఎన్నికల హామీలను నెరవేర్చేలా చేయాలని కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ
అన్నమయ్య జిల్లాలోని యువత, విద్యార్థులు కడలి తరంగమై కదలి వచ్చారు. హామీలిచ్చి మోసం చేసిన కూటమి సర్కారుపై ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పన, నెలకు నిరుద్యోగ భృతి రూ 3 వేలు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల నిధులు విడుదల చేయనందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన రాయచోటిలో వైఎస్ఆర్ సిపి యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు విజయవంతం అయింది. జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు యువతకి గర్జన చేసింది. జిల్లా నలుమూలల నుంచి యువత, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి గర్జించారు. అభిమానం ఏకమై.. ప్రజల స్వరమై.. ఉద్యమ గళమై.. సమర నినాదమై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నెలకు రూ 3 వేలు నిరుద్యోగభృతి ఇవ్వాలని, ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయక చంద్రబాబు తప్పారని ధ్వజమెత్తారు. కూటమి పాలనను దుయ్యబట్టారు.ప్రజలను,యువతను,విద్యార్థులను మోసం చేయడంలో బాబు ట్రేడ్ మార్క్ అని అన్నారు. యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.ఇచ్చిన హామీలపై పోరాడి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేలా తీరుతామని నిరుద్యోగ యువత,విద్యార్థులు కూటమి పాలనపై దండెత్తారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు యువత, విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, ముఖ్య అతిధులుగా గా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి,గాలివీడు మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలివీటి వివేకానంద రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రధర్, మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హారూన్ బాష, బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ భాస్కర్,రాయలసీమ బూత్ కన్వీనర్ భరత్ కుమార్ రెడ్డి. *పీలేరు:* మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మమత, యువజన విభాగం నాయకులు ద్వారక నాద రెడ్డి,భువనేశ్వర్ రెడ్డి,లోకనాథరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు సురేష్ నాయక్ ,లోకనాధం,నరేష్ తదితరులు *మదనపల్లె* యువజన విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, శారద రెడ్డి, నరేంద్ర రాయల్, మల్లికార్జున రెడ్డి, పవన్ తేజ, రాజు . *తంబల్లపల్లె*: నాగమణి, వాసుదేవ రెడ్డి, నక్కా రమాదేవి, అమర్నాథ్ రెడ్డి *రాజంపేట:* ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు గీతాల నరసింహారెడ్డి, యువజన విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం నియోజక వర్గ అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్, స్టేట్ సెక్రటరీ జుబేర్, బూత్ కన్వీనర్ రెహమాన్ ఖాన్, బాల్ రెడ్డి,శివకుమార్ రాజు,గంగిరెడ్డి, కళ్యాణ్. *కోడూరు:* ప్రశాంత్, రఘు, అజయ్ రెడ్డి,శివ కుమార్, నాగ భూషణం,మదన మోహన్ రెడ్డి,ప్రభాకర్ యాదవ్, కోటేశ్వర యాదవ్, సుధీర్ రెడ్డి, గల్లా శ్రీనివాసులు, *రాయచోటి:* నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డికుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు కొత్తపల్లె ఇంతియాజ్, స్టూడెంట్ వింగ్ పట్టణ అధ్యక్షుడు ఫైజాన్, గువ్వల జగదీష్, శివ కుమార్ , సయ్యద్ ఫైజాన్, సోషియల్ మీడియా షమీర్, గణేష్, పరశురాం, వినోద్ నాయుడు, అయోధ్యాపురం పవన్ కుమార్ రెడ్డి,జగదీష్, బండపల్లె భరత్, వెంకట్రామి రెడ్డి, శివారెడ్డి, రాఘవేంద్ర నాయుడు,శివ శంకర రెడ్డి,రాజేష్, సురేష్, మదూకర్ రెడ్డి,నరసింహా రెడ్డి,అంజాద్ బాష,అబ్బవరం అశోక్, కౌన్సిలర్లు: సుగవాసి శ్యామ్, షబ్బీర్, రియాజ్, సి గొల్లపల్లె సర్పంచి రామచంద్ర, నాయకులు: సమర, సోమిరెడ్డి, చిన్నమండెం చుక్కా అంజనప్ప,బేపారి అసద్, మహేష్, ఖదీర్, పుల్లగూర అనీల్,వెంకట్రామి రెడ్డి,హరి , జగన్ మోహన్, మదన మోహన్ నాయుడు, సన్నీ,సాదిక్, హర్షద్, షకీల్, ఇర్ఫాన్,రియాజ్, సమీర్,అబ్బాస్,బాబు తదితర యువజన,విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
View More
Latest News
23 Jun 2025 19:16 PM
1
45
Newsread Image

No.1 Short News

Newsread
పొదలకూరు లో రియల్టర్ ఆత్మహత్య ?
పొదలకూరు పట్టణంలో ఓ రియల్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. అప్పుల బాధ తాళలేక తాను ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని నెల్లూరులోని వారి నివాసానికి తరలించినట్లు సమాచారం. రియల్టర్ మృతిని గోప్యంగా ఉంచినట్లు స్థానికులు చర్చించుకొంటున్నారు. అయితే రియల్టర్ ఆత్మహత్య పట్ల పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. కాగా పొదలకూరులోని చాలా మంది రియల్టర్లు వెంచర్లు వేస్తున్నామంటూ పట్టణంలోని మిత్రులు, వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.
View More
Latest News
22 Jun 2025 12:31 PM
1
50
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్*
ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి. – సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్.. సూర్యాపేట: ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలుచుకొని విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప్రైవేట్ పాఠశాలలు మోపుతున్నాయని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పట్టణ పార్టీ కార్యాలయంలో జరిగిన వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూప్రవేట్ కార్పోరేట్ పాఠశాలలు అనేక కోచింగ్ సెంటర్ల పేరుతోటి నవోదయ గురుకులం సైనిక్ పేర్లతోటి ఓలంపియాడ్, ఐపీఎల్, గ్లోబల్, IPL. ఇంటర్నేషనల్ సీబీఎస్సీ గ్లోబల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో మాయ చేస్తూ, యూకేజీ నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుంచి పుస్తకాలు, టై,బెల్ట్‌లు, డ్రెస్‌లు, మరెన్నో పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. కొంతమంది యాజమానులు డొనేషన్ పేరిట నర్సరీ నుండి పదో తరగతి వరకు రూ.1,50,000 వరకు వసూలు చేస్తున్నారని, ఇది తల్లిదండ్రులపై తీవ్ర భారం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్య హక్కు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉచితంగా కనీసం 25% సీట్లు ఇవ్వాల్సిన నిబంధనను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.జిల్లా విద్యా అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తక్షణమే స్పందించి సంబంధిత యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, కప్పల సత్యం, మాధగోని మల్లేష్, ఒట్టే ఎర్రయ్య, శశిరేఖ, జయమ్మ, పిట్టల రాణి పాల్గొన్నారు.
View More
Latest News
22 Jun 2025 07:52 AM
2
57
Newsread Image

No.1 Short News

Newsread
School Ad badam
Latest News
22 Jun 2025 03:57 AM
2
42
Newsread Image

No.1 Short News

Newsread
Newsread update
Latest News
21 Jun 2025 10:01 AM
4
47
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: పేద విద్యార్థులకు ఉచిత విద్య: మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్
ప్రవేటు స్కూల్ లో ఫీజులు కట్టుకోలేని పేద విద్యార్థులకు దర్శి లోని పొదిలి రోడ్ లో గల మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్ నందు ఉచిత విద్య అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ప్రముఖ సంఘసేవకులు కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారం గా మారిన నేటి రోజుల్లో పేద విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా 25% సీట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేనేజ్మెంట్ తెలిపారు. ఫ్రీ అడ్మిషన్ కొరకు వెంటనే 9603331234,98483 48002, 9948661194 నెంబర్ కి సంప్రదించగలరు, లేదా నేరుగా స్కూల్ కి రాగలరు అని తెలిపారు.
View More
Latest News
19 Jun 2025 14:52 PM
7
120
Newsread Image

No.1 Short News

Newsread
ఉపరాష్ట్రపతితో నారా లోకేశ్ భేటీ
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన..ఈరోజు, రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్, బైరెడ్డి శబరి ఉన్నారు.
View More
Latest News
18 Jun 2025 11:36 AM
2
52
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీకాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన నవాజ్ అలీ & అభిమానులు
వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా షైక్ నవాజ్ అలీ మరియు తన అభిమానులు దీప బ్లడ్ బ్యాంకు లో బ్లడ్ డొనేట్ చేశారు.
View More
Latest News
15 Jun 2025 18:24 PM
6
75
Newsread Image

No.1 Short News

Newsread
పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు పంపిణీ చేసిన పరిటాల సురేష్
గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ఆదేశాల తో, తన గురువు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో,దర్శి మండలము, చౌటపాలెం లో, టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు..మానవ మనుగడ కోసం మనం అందరం పాటు పడదామని సురేష్ అన్నారు. ప్రకృతి లో జీవ వైవిధ్యం కాపాడుకోవడం కోసం మొక్కలు నాటి సంరక్షించాలి, భవిష్యత్ తరాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి మంచి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, చెన్న రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుబ్బారావు గ్రామస్తులు పాల్గొన్నారు.
View More
Latest News
14 Jun 2025 20:37 PM
3
64
Newsread Image

No.1 Short News

Newsread
తల్లికి వందనం పథకం పై మరో అప్డేట్
అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు, ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 తారీకు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితా లో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి జూలై 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిన విద్యార్ధులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్యదీవేన పథకం కిందకి వస్తారు.
View More
Latest News
14 Jun 2025 20:30 PM
0
57
Newsread Image

No.1 Short News

Newsread
పాలనా వ్యవస్థ లో జీరో కరప్షన్ ఉండాలి: చంద్రబాబు
పాలనా వ్యవస్థలో ‘జీరో కరప్షన్’ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతి జరుగుతుందనే సమాచారం ఉన్న చోట దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది పాలనలో వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
14 Jun 2025 20:22 PM
1
54
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
గొంగడికి ప్రపంచ వారసత్వ కమిటీ యునెస్కో గుర్తింపు
కురుమ కులస్తుల సంప్రదాయ వస్త్రం గా ఉన్న గొంగడికి యునెస్కో ( ప్రపంచ వారసత్వ కమిటీ ) గుర్తింపు లభించింది , చలికాలం లో వెచ్చగా , ఎండాకాలంలో చల్లగా ఉండటం ఈ గొంగడి ప్రత్యేకత . భారత దేశం లో 47 రాష్ట్రాల్లో ఈ గొంగడి ని సంప్రదాయ వస్త్రంగా భావిస్తారు . అలాంటి గొంగడికి యునెస్కో గుర్తింపు రావడం హర్షణీయకరమని బీర్కూర్ మండల కురుమ సంఘ నాయకులు బిరుగొండ ఒక ప్రకటన లో తెలిపారు
View More
Latest News
14 Jun 2025 08:20 AM
0
48
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
విమాన ప్రమాద మృతుల ఆత్మశాంతి కోసం ఖురాన్ పఠనం : ఫారూఖ్ షుబ్లీ
మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి ఫరూఖ్ సూచనల మేరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఈరోజు ఉదయం 9 గంటలకు దివ్య గ్రంథం ఖురాన్ పూర్తిగా పఠనం చేసి ప్రార్థన చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ముస్లిం మత పెద్దలు పెద్దలు మైనార్టీ మరియు న్యాయ శాఖ మంత్రి ఫరూక్ , ఖాజీ హబీబుల్లా హుసేని, MHPS ఉలేమా విభాగం సభ్యులు ముప్తీ యూనస్ , మౌలానా అబ్దుల్ సత్తార్, హఫీజ్ అబ్దుల్ రషీద్ హఫీజ్ అబ్దుల్ సమద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా విమానంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబాలకు అనంత కరుణామయుడు అపార కృపా శీలుడు అయిన అల్లాహ్ సహనాన్ని ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇటువంటి దారుణమైన దుర్ఘటనలో పునరావృతం కాకుండా భగవంతుని యొక్క చల్లని దీవెనలు మా దేశం పై ప్రపంచంపై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది.
View More
Latest News
13 Jun 2025 11:15 AM
1
75
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
తల్లికి వందనం పధకం పై ఫిర్యాదులకు అవకాశం: సీఎం చంద్రబాబు
విజయవాడ : తల్లికి వందనం పథకం డబ్బులు జమ అవ్వకపోతే ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాలు తలెత్తినా సరిచేసి డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ఈనెల 26 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుల్లో, సచివాలయాల్లో పెడతామని పేర్కొన్నారు. ఈ నెల 30న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
View More
Latest News
12 Jun 2025 15:13 PM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లులో భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఈరోజు బక్రీద్ సందర్భంగా ఉల్లగల్లులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా హజరత్ మౌలానా అబూబకర్ సిద్ధిక్ గారు ఈద్ ఉల్ అదా నమాజ్, ఖుత్బా, దువా చదివించగా హజీ అబ్దుల్ రహీం గారు మాట్లాడుతూ బక్రీదు త్యాగ ఫలితం అని త్యాగానికి ప్రతీక అని చెప్పారు అలాగే ప్రవక్త వారి ఆచరణను జీవితంలో ఉంచుకుని ఇహ పరలోక సాఫల్యాలను పొందాలని కోరారు.
View More
Latest News
07 Jun 2025 10:11 AM
1
51
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఉల్లగలులో భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఈరోజు బక్రీద్ సందర్భంగా ఉల్లగల్లులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా హజరత్ మౌలానా అబూబకర్ సిద్ధిక్ గారు ఈద్ ఉల్ అదా నమాజ్, ఖుత్బా, దువా చదివించగా హజీ అబ్దుల్ రహీం గారు మాట్లాడుతూ బక్రీదు త్యాగ ఫలితం అని త్యాగానికి ప్రతీక అని చెప్పారు అలాగే ప్రవక్త వారి ఆచరణను జీవితంలో ఉంచుకుని ఇహ పరలోక సాఫల్యాలను పొందాలని కోరారు.
View More
Latest News
07 Jun 2025 10:08 AM
1
43
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
జిల్లాలోని ముస్లిం సోదర సోదరీ మణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని మానవాళికి చూపుతూ, తమకు కలిగిన దాంట్లో నుండి ఇతరులకు పంచిపెట్టే దాతృత స్ఫూర్తిని కలిగిస్తూ త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిల్చే బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. బక్రీద్‌ పండుగ వేడుకలు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనదని, ముందస్తు భద్రత చర్యల్లో అన్ని మత పెద్దలతో, శాంతి కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించి ప్రార్ధనలు మరియు ఇతర కార్యక్రమాలు సమయములలో ఎలాంటి సంఘటనలు, సమస్యలు లేకుండా సుఖ శాంతులతో జరుపుకోవాలని సూచిస్తూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని మసీదులను కవర్ చేస్తూ పెట్రోలింగు నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగు చేసుకోవాలన్నారు. మతసామరస్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు, గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా గోవులను తరలించినా, గోవధకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. జంతువుల అక్రమ రవాణా, గోవధ నిరోధించడానికి ప్రకాశం జిల్లా నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ప్రభుత్వం గోవధను నిషేధించిందని, గో సంరక్షణ చట్టం ప్రకారము గోవులను వధించడం చట్టరీత్య నేరం. శాంతి భద్రతల సమస్యలు, మత సంఘర్షణలు తలెత్తేలా ఎవ్వరు ప్రవర్తించకూడదు, ప్రేరేపించరాదు. మత ఘర్షణలను ప్రేరేపించే పుకార్లను నమ్మవద్దు, అపోహలు, వదంతులను నమ్మి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయరాదు.అందరు మతసామరస్య భావనతో శాంతియుతంగా మెలగాలి. గోవధ, పశువుల అక్రమ రవాణా పై ఏదైనా సమాచారమును పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ :9121102266, డయల్ :112/100 స్ధానిక పోలీసులకు తెలియచేయాలి. వ్యక్తిగతంగా వాహనాలను ఆపి గొడవలకు దిగరాదని,ఆ సమాచారం పోలీస్ లకు తెలియచేయాలని, కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఎస్పీ గారు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
View More
Latest News
07 Jun 2025 07:43 AM
2
45
Refresh Page
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (658)
  • Motivation (10)
  • Crime News (19)
  • Local Ads (33)
  • Entertainment (14)
  • Local Updates (185)
  • Sports News (12)
  • Education (8)
  • Business Promotions (1)
  • Politics (63)
  • Breaking News (92)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.