దర్శి: అంతరిక్షం నుంచి భూమికి చేరిన శుభాంశు శుక్లా చిత్రపటానికి పాలాభిషేకం
ప్రపంచంలోని అన్ని దేశాలచే కీర్తింంబడే భారత అంతరిక్ష యువ పరిశోధకులు శుభాంశు శుక్లా, 18 రోజులు అంతరిక్షంలో 60 పరిశోధనలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని సురక్షితంగా భూమండలం మీదకు చేరిన శుభ సందర్భంగా, ఈరోజు స్థానిక డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో, ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుభాంశు శుక్లా చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్, అధ్యక్షత వహించగా,ముఖ్య అతిధిగా కపురం శ్రీనివాస రెడ్డి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా,కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..., క్రమశిక్షణ అంకితభావం,నిబద్ధత కలిగివుంటే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని,వీటన్నింటికీ గురువులే కారణమని అద్యాపకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.