కమిటీలను పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి : సైదా
మార్కాపురం టౌన్. (తేదీ 17, జూలై)
కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయాలని, త్వరలోనే మండల పట్టణ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నేడు మార్కాపూర్ పట్నంలో జరిగిన పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ సైదా అన్నారు.
ఈ నెలాఖరులోపు మండల పట్టణ కమిటీల కార్యవర్గాలను పూర్తి చేయాలని, పార్టీలోనికి యువ రక్తాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
త్వరలోనే మార్కాపూర్ పట్నంలో గత కొంతకాలంగా అపస్కృతంగా ఉన్న ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, చెరువుగట్టు పై రోడ్డు వెడల్పు, నిలిచిపోయిన షాదీ ఖానా సత్వర నిర్మాణం పూర్తి, తదితర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమీస్తుందని ఈ సమావేశంలో తీర్మానించడమైనది.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ రెహనాబాను,జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ షంషీర్, ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ వలి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, తర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, మైనార్టీ నాయకులు షేక్ ముజీబ్, కొండయ్య, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.