కారం చేడు మృత వీరులకు నివాళులర్పించిన దళిత సంఘాల నాయకులు
దర్శి: ఈరోజు స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణములో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రదళితసేన,నవ్యాంధ్ర మాదిగ చర్మకారులుడప్పుకళాకారులు పోరాటసమితి సంఘాల ఆధ్వర్యంలోతెలుగు రాష్ట్రాలలో మర్చిపోని విషాద ఘట్టం కారంచేడు దళితుల హత్యకాండకు 40ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నవ్యాంధ్రమాదిగచర్మకారులు డప్పుకళాకారులు పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళితసేనదర్శినియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కారంచేడుదళితుల1985 జులై 17 ఊచకోతకి గురిఅయిన ఆరుగురు దళితుల ప్రాణత్యాగ ఫలితంతో ఈరోజుతెలుగు రాష్ట్రలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1998, అప్పటి రాష్ట్ర ప్రభుత్వలు జీవోను అమలు చేయటం వల్ల కారంచేడు దళితుల మతవీరుల త్యాగఫలమే అట్రాసిటీ యాక్ట్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కారంచేడు మృత వీరులకు నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాలనాయకులు మిట్ట రమేష్, ఆళ్లగడ్డ వీరయ్య, నాగేశ్వరరావు, ఇత్తడి సాల్మన్ బాబు, కావూరి రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.