Select Location
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరులో పేకాట శిబిరంపై దాడులు
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రావడంతో, ముండ్లమూరు ఎస్సై నాగరాజు తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
View More
Local Updates
25 Mar 2025 04:01 AM
3
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ALERT: ప్రకాశం జిల్లాకు వర్ష సూచన
ప్రకాశం జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాతో పాటు అల్లూరి, మన్యం YSR, నంద్యాల, పల్నాడు (D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
View More
Latest News
21 Mar 2025 08:22 AM
0
34
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'
తూర్పు గంగవరంలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మల్లికార్జునరావు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. సెల్ఫోన్, అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్
బెట్టింగ్ యాప్స్ వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయటం తప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా MAA అసోసియేషన్కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకుడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
View More
Crime News
21 Mar 2025 08:21 AM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ
AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్షి జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.
View More
Politics
21 Mar 2025 08:21 AM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన EE
తాళ్లూరు మండలం కొరపాటివారిపాలెంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పంచాయతీరాజ్ EE కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 58 పనులకు 3 కోట్లు మంజూరు కాగా 53 పనులు లు పూర్తయ్యాన్నారు. అలానే నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల AE వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో అగ్ని ప్రమాదం.. రైతుకు రూ.8 లక్షలు నష్టం
తాళ్లూరు గ్రామంలో ఎడమ కంటి నాగిరెడ్డికి చెందిన పొగాకు బ్యార్ని ప్రమాదవశాత్తు బుధవారం తెల్లవారు జామున దగ్ధం అయింది. పొగగొట్టంపై పొగాకు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రైతు తెలిపారు. దాదాపు 1200 పొగాకు కర్రలు రూ.8 లక్షల నష్టం వచ్చినట్లు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.
View More
Local Updates
21 Mar 2025 08:20 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!
ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
View More
Sports News
21 Mar 2025 08:20 AM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం
తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఏప్రిల్ 2020 సమయంలో దేశం ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజల కు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజల కు 5 ఏళ్ల నుంచి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిరు దేశం లో 80 కోట్ల మంది కి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ షాపుల్లో పెట్టక పోవడం దూరదృష్ట కారణమైన చర్య బీర్కుర్ మండలo లో ఉన్న ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంచాలి అని స్థానిక తహసీల్దార్ లత కుమారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ మండల ప్రధాన కార్యదర్శి లు మల్లె యోగేష్, బొంత లా శ్రీనివాస్ BJYM మండల ప్రెసిడెంట్ కొట్టే వినేష్, SC మోర్చా మండల ప్రెసిడెంట్ మేత్రీ సాయిలు బిజెపి సీనియర్ నాయకులు హాన్మాన్డ్లు, సాయి బాబా, కార్యకర్తలు వడ్ల బస్వరాజు, పండారి, ఆవారి శంకర్ పాల్గొన్నారు
View More
Latest News
20 Mar 2025 19:09 PM
0
23
Newsread image

No.1 Short News

Newsread
బోలికొండ్రాయ స్వామి తిరుణాల మహోత్సవ వేడుకలు
కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం శ్రీ ప్రసన్నఆంజనేయ తిరుణాల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ తిరుణాల పడమర నాయుడుపాలెం, ఆవులమంద, కల్లూరు కు చెందిన మూడు గ్రామాల ప్రజలు ఈ తిరుణాల వైభావంగా జరుపుకుంటారు ఈ నెల 19 వ తారీకు నాడు తిరుణాల అంకురార్పణ కార్యక్రమం ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలాగే సాయంత్రానికి 7 ఎలక్ట్రికల్ ప్రభలు 2 కోలాటం ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ వారు తెలిపినారు
View More
Latest News
20 Mar 2025 10:48 AM
0
20
Newsread Image

No.1 Short News

Newsread
జిల్లా ఎస్పీ కి అత్యాధునిక డ్రోన్ కెమెరా అందచేసిన ఆవులమంద వాసి
ప్రకాశం జిల్లా, కురిచేడు మండలం ఆవుల మంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ గారికి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను అందజేసినారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సామాజిక బాధ్యత, సేవ స్ఫూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించటం అభినందనీయమని కొనియాడారు ఆ డ్రోన్ ను త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. అస్సన్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం సీనియర్ నాయకులు పడమర గంగారంమాజీ సర్పంచ్ దాసరి.ఏడుకొండలు, బోనపల్లి మాజీ సర్పంచ్ వి. వెంకటేశ్వర్లు, మాజీ డీలర్ గొట్టిపాటి. రామయ్య, కొలిశెట్టి కాశి పాల్గొన్నారు
View More
Latest News
19 Mar 2025 09:48 AM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నీటి సమస్య లేకుండా చూడాలి: గొట్టిపాటి లక్ష్మి
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శిలో డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి ప్రారంభించాలని, వేసవి కాలంలో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న దొనకొండ, కురిచేడు మండలాల సమస్యలను సీఎం ద్రుష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. దర్శి- దొనకొండ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.
View More
Politics
19 Mar 2025 09:47 AM
0
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చీమకుర్తిలో అక్రమ గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ప్రజలు
చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామ కొండ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. బెంగళూరు-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్ తీసుకోవాలని వెళ్తున్న లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కొండను త్రవ్వటం వల్ల వర్షాకాలంలో కొండపై నుంచి వర్షపు నీళ్లు గ్రామ చెరువుకు అందుతుందని గ్రావెల్ తవ్వకాలును ఆపాలన్నారు.
View More
Local Updates
19 Mar 2025 09:47 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేడు ప్రధానితో సీఎం భేటీ
AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM
0
22
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రేపు భూమిపై అడుగుపెట్టనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి ఉదయం 3.27 నిమిషాలకు భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరు ప్రయాణించే వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో గల సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉ. 8:15 గంటలకు వీరి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 14:55 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
View More
Breaking News
18 Mar 2025 14:54 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తప్పు మీది కాదు.. EVMలది: ఆర్కే రోజా
AP: మెడికల్ కాలేజీలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసిందని, ఇప్పుడు బడుల వంతు అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. 'అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు లేండి. తప్పు మీది కాదు.. తప్పంతా EVMలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ, బెల్ట్ షాపులైనా ఉండొచ్చా?' అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
View More
Politics
18 Mar 2025 14:54 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం
AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
View More
Latest News
18 Mar 2025 14:54 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
YV సుబ్బారెడ్డి తల్లికి YS విజయమ్మ నివాళి
రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబంధాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.
View More
Politics
18 Mar 2025 13:20 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
మేదరమెట్లకు బయలదేరిన వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ
కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. 'లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు'ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
View More
Breaking News
18 Mar 2025 13:18 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల
శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
View More
Latest News
18 Mar 2025 13:18 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
YV సుబ్బారెడ్డి తల్లికి బాలినేని నివాళులు
YV సుబ్బారెడ్డి తల్లికి బాలినేని నివాళులు YV సుబ్బారెడ్డి తల్లి సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి, వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి మాతృమూర్తికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలు పిచ్చమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డికి వరుసకు అత్త అవుతారు.
View More
Politics
18 Mar 2025 13:17 PM
0
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
సీఐడీ కస్టడీకి పోసాని
AP: సినీ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయనను GGHకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయంలో సాయంత్రం 5 గం. వరకు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్లను దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
View More
Politics
18 Mar 2025 13:16 PM
0
8
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ • టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం • అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ✓YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా
View More
Politics
18 Mar 2025 10:36 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఒంటి పూట బడుల సమయం మార్పు
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
View More
Education
18 Mar 2025 10:35 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్‌లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్‌లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
10
Newsread Image

No.1 Short News

Newsread
పడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM
2
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: ప్రకృతి ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం”
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సోమవారం అధికారులు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆరోగ్యానికి మంచిదని ఏవో ప్రసాదరావు తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు రాబడి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
View More
17 Mar 2025 17:48 PM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
జరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఈరోజు తాళ్లూరు మండలంలో 10 వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
ఈరోజు 10 వ తరగతి పరీక్షలు మొదలు కావున తాళ్లూరు మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కలిపి 818 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉడగా 808 మంది విద్యార్థులు హాజరు కాగా 10 మంది విద్యార్థులు మాత్రం పరీక్షా కేంద్రాలకు హాజరు కాలేదు.
View More
Latest News
17 Mar 2025 17:02 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స
AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. '2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు' అని ఆయన ఫైర్ అయ్యారు.
View More
Politics
17 Mar 2025 16:09 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
మార్కాపురం: ఆస్తి తీసుకొని గెంటేశాడయ్యా!
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాడు.
View More
Local Updates
17 Mar 2025 14:58 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?
IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది. టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్ (C), లివింగ్టన్, జితేశ్ శర్మ, బెథెల్/ టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్ వుడ్, సుయాశ్.
View More
Sports News
17 Mar 2025 14:58 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఫేక్ పాస్‌పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!
సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్‌పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
View More
Latest News
17 Mar 2025 14:57 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
BREAKING: మోదీ పాడ్‌కాస్ట్ షేర్ చేసిన ట్రంప్
ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్‌కాస్ట్‌లో RSSతో అనుబంధం, భారత్‌కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
View More
Latest News
17 Mar 2025 14:57 PM
0
12

No.1 Short News

Newsread
గుంటూరు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ సరిగా లేవని విద్యార్థుల ఆందోళన.అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూములకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు. కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు.
View More
Breaking News
17 Mar 2025 14:38 PM
2
29

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు.
ఒంగోలులోని రామ్ నగర్ లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 183 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
View More
Latest News
17 Mar 2025 14:23 PM
2
16
Newsread Image

No.1 Short News

Umar Fharooq
దీక్ష చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ
బాపట్ల డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన యద్దనపూడి మండలం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.. సంఘీభావం తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, ప్రజా సంఘాలు.
View More
Latest News
17 Mar 2025 14:21 PM
0
9
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : తాత్కాలిక నివాసం ఏర్పాటు కోసం వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు
అందరికీ నమస్కారం బీర్కూర్ గ్రామo లో నివాసం ఉంటున్న పిడుగు సాయవ్వ w/o గంగారాం, పిడుగు శాంతవ్వ w/0 బాబయ్య, పిడుగు గంగవ్వ మూడు కుటుంబాలు పోయిన నెల 27 వ తేదీన వారి మూడు ఇళ్లు విద్యుత్ ప్రమాదం తో ఇళ్లు పూర్తి గా కాలి పోవడం జరిగింది పూర్తి స్థాయిలో అస్తి నష్టం వాటిల్లింది వారికి ఉన్నడానికి ఇళ్లు కూడా లేదు కావున వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలి వారికి వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటికి వరకు ఉండడానికి వారికి తాత్కాలికంగా నివాసం ఉండడానికి స్థావరం ఏర్పాటు చేయాలి లేక పోతే బీర్కూర్ గ్రామo లో నిర్మించిన ఉన్న డబుల్ బెడ్ రూమ్ లో 3 ఇళ్ల నీ వాళ్లకు ఇవ్వాలి అని ఈ రోజు బిజెపి శాఖా ఆధ్వర్యంలో బాధితుల తో కలిసి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయాడం జరిగింది బాధితుల కు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారకు పోరాటం చేస్తామని బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి యోగేష్, బిజెపి సీనియర్ నాయకులు హన్మాoడ్లు, నూకల రాము, రాజు, సాయిబాబా, బస్వరాజు, ఆవారి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు
View More
Latest News
17 Mar 2025 14:10 PM
0
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరూ మంచి మార్కులు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ ఆల్ ది బెస్ట్ చెప్పటం జరిగింది.
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ 'ప్రజ్ఞాన్'ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా
ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
View More
Jobs
17 Mar 2025 12:42 PM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి పరీక్ష కేంద్రాలు 2025 తాళ్లూరు మండలం
SSC EXAMS 2025 TALLUR MANDAL 1.VKGHS TALLUR 2.C.NO.---57043 3.Total students -173 4.CS.Name. P.Anjali. ----------------------------------------- 1.Saraswathi HS 2.C.NO.---57044 3.Total students -140 4.CS.Name-B.RamaRao ------------------------------------- 1.BK padu A.Centre 2.C.NO.---57062 3.Total students -130 4.CS.Name-YSR Prasad. ------------------------------------- 1.BK padu B.Centre 2.C.NO.---57063 3.Total students -120 4.CS.Name-M.Ramana Reddy. ------------------------------------- 1.ZP East Gangavaram 2.C.NO.---57180 3.Total students -162 4.CS.Name-B. Srinivasa Rao. -------------------------------- 1.Jahnavi HS East Gangavaram 2.C.NO.---57181 3.Total students -100 4.CS.Name-N.Venkateswarlu
View More
Latest News
17 Mar 2025 12:42 PM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
చలివేంద్రాన్ని ప్రారంభించిన బాపట్ల ఎమ్మెల్యే
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద చండ్రపాటి సత్యనారాయణ - రంగనాయకమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు చండ్రపాటి వెంకట రామమోహన్ రావు (రాంబాబు) - ఉదయలక్ష్మి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లె రామసుబ్బారావు,జిట్టా శ్రీనివాసరావు,ఆర్.టి.సి డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ,వక్కల గడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
17 Mar 2025 12:41 PM
0
12

No.1 Short News

Newsread
దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు
ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ,భద్రత మొదట ప్రాధాన్యత అని, ఆపదలో ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా శక్తి టీమ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మహిళలు భద్రత,రక్షణకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు,బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం లో ఒక ఎస్సై, ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఇంకా మద్దతు గా సబ్ డివిజన్ లో వున్న ఉమెన్ పీసీ లందరూ సపోర్ట్ గా వుంటారని తెలిపారు.ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా ఆపద ఎదురైతే శక్తి యాప్ లో ఆప్షన్స్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చునని దర్శి డీఎస్పీ తెలిపారు.
View More
Breaking News
17 Mar 2025 12:23 PM
4
69
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel