తాళ్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన దర్శి డీఎస్పీ
ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్ పోలీసు అధికారి నేడు దర్శి సీఐ తో కలిసి తాళ్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు.
ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసులను త్వరితగతిన పూర్తి చేయడం, సంబంధిత కేసుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడం వంటి అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్టేషన్ రికార్డులు, కేసుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించిన ఎస్‌డీపీఓ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తూర్పు గంగవరం లో పారిశుధ్య రథం ప్రారంభం & ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
తూర్పు గంగవరం పంచాయతీలో సోమవారం ఎంపీడీఓ పి. అజిత పారిశుధ్య రథాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షులు వి. చిన్న సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీఓ వి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో Census-2027 ఇంటింటి గణనను వేగవంతం చేయాలని ఎంపీడీఓ సూచించారు. మండలంలో మొత్తం 6,089 మంది పెన్షనర్లకు రూ.2.69 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 4,047 మందికి రూ.1.80 కోట్లు (68%) పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి జూన్ 3 వరకు స్వర్ణ గ్రామ కార్యాలయంలో పెన్షన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ అభినందనలు
ఒంగోలు, మే 30: ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీఐలుగా పదోన్నతి పొందిన కె. కమలాకర్ (సీసీఎస్ పోలీస్ స్టేషన్), ఎం. మురళి (దర్శి పోలీస్ స్టేషన్), యు. వెంకటకృష్ణయ్య (టాస్క్ ఫోర్స్, ఒంగోలు)లను ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, సీఐ హోదాకు పదోన్నతి పొందడం వల్ల బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ఠలను పెంపొందించేలా ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు తావు లేకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన, ఉత్తమ పోలీసింగ్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ సూచించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో దర్శిలో ర్యాలీ
దర్శి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు పాల్గొన్నారు. అలాగే పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పీహెచ్‌సీలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం PHCలో డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వేసవిలో ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్లపై అమ్మే రంగు పానీయాలు తాగరాదని తెలిపారు.
వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లగా ఉంచాలని, అపస్మారక స్థితిలో ఉంటే నీరు ఇవ్వకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దర్శి పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు స్వయంగా పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ పరిస్థితిని పరిశీలించారు.
బంక్ యజమానుల ప్రకారం దర్శిలో ఎటువంటి కొరత లేదని, వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రజలు వదంతులను నమ్మవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
అదేవిధంగా ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తే Essential Commodities Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
సోమవరప్పపాడులో సందడి.. చంద్రబాబు బర్త్‌డేకు యువత ప్రత్యేక వేడుకలు!
తాళ్లూరు మండలం సోమవరప్పపాడు గ్రామంలో N. Chandrababu Naidu పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో SK. సైదా, సురేష్, వెంకటరావు, సాయి, డానీ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.
గ్రామంలో ఉత్సాహభరితంగా జరిగిన ఈ వేడుకలు స్థానికంగా ఆకర్షణీయంగా నిలిచాయి
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆయన ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె. నివాస్ ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తన వివరాలను నమోదు చేశారు.
ఈ స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
ప్రజలు తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒంగోలు: సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ… రంజాన్ మాసం ముస్లింలకు ఆత్మశుద్ధి, నియమ నిష్ఠకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసంతో పాటు ఇఫ్తార్ సమయంలో దేశ అభివృద్ధి, సమాజ ఐక్యత, శాంతి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దర్శిలో రథం లాగిన గొట్టిపాటి దంపతులు, శివ నామస్మరణతో మార్మోగిన పట్టణం
మహాశివరాత్రి సందర్భంగా దర్శి పట్టణంలో శివపార్వతుల రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలంకరించబడిన రథాన్ని భక్తులతో కలిసి లాగుతూ శివభక్తిని చాటారు.
డా. గొట్టిపాటి లక్ష్మి దంపతుల పాల్గొనడంతో రథోత్సవానికి ప్రత్యేక శోభ చేకూరింది. శివనామ స్మరణతో దర్శి పట్టణ పురవీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయవాడ:
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి అన్నారు. మేడారం జాతర సందర్భంగా వేధింపులకు గురైన కోవా బన్ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం మత సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వలీ & అతని మిత్ర బృందానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
మేడారం కోవా బన్ వివాదం: పేద వ్యాపారి వలీకి అండగా మంత్రి నారా లోకేష్
మేడారం జాతరలో చోటుచేసుకున్న కోవా బన్ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఈ ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న పేద వ్యాపారి వలీకి అండగా నిలుస్తూ, ఆయనకు ధైర్యం చెప్పారు.
సోషల్ మీడియాలో స్పందించిన నారా లోకేష్ –
డియర్ బ్రదర్ వలీ, నీవు ఎదుర్కొన్న పరిస్థితికి నేను చాలా బాధపడ్డాను.
ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు.
త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను.
మనమందరం కలిసి నిలబడదాం అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో వలీకి మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు.
సాధారణ జీవనం సాగించే చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి అవమానించే ప్రయత్నాలు సమాజంలో ప్రమాదకర సంకేతాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చర్చ మొదలైంది.
ఉల్లగల్లు టీడీపీ కార్యకర్త షేక్ బాజీ మృతి పట్ల నారాపుశెట్టి పాపారావు సంతాపం
దర్శి / ఉల్లగల్లు:
దర్శి నియోజకవర్గంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం యువ కార్యకర్త షేక్ బాజీ (యువ కిరణం) అకాల మరణం పట్ల దర్శి మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
షేక్ బాజీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని పాపారావు పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం యువతను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు.
ఈ సందర్భంగా నారాపుశెట్టి పాపారావు మాట్లాడుతూ,
“షేక్ బాజీ అకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ఈ కష్టం నుంచి బయటపడేందుకు పార్టీ తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతునికి నివాళులర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకుడికి మానవత సంస్థ ఆర్థిక సహాయం
దర్శి, ప్రకాశం జిల్లా:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు, కాలికి శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం మంచానికే పరిమితమై, గతంలో భార్యను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్న ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలోని బంగారమ్మగుట్ట గ్రామానికి చెందిన రాచగొర్ల రాజయ్య అనే యువకుని దీనస్థితి మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు తెలియడంతో, సంస్థ సభ్యులు మానవతతో ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఈ రోజు దరశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య, అత్యవసర విభాగం డైరెక్టర్ రోశారావు, సభ్యులు నారాయణ తదితరులు బంగారమ్మగుట్ట గ్రామంలోని బాధితుని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి మనోధైర్యం నింపుతూ సంస్థ తరఫున ₹5,000/- నగదును అందజేసి ఆత్మీయ సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ మహోన్నత ఆశయాలతో, విలువలతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 141 కేంద్రాల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మానవతామూర్తులు ఈ సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని, సంస్థ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
తిరుమలలో దేవుని ముందు లక్కీ డ్రా రీల్స్.. యువకులు అరెస్ట్
తిరుమల ఆలయం ముందు “లక్కీ డ్రాలో బీఎండబ్ల్యూ కారు గెలుచుకోండి” అంటూ ఇద్దరు యువకులు రీల్ వీడియో చేశారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
గోలి 4 అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడిని కారుతో సహా తిరుమలకు తీసుకొచ్చారు.
మరో వ్యక్తి నరేంద్ర ఇప్పటికే హైదరాబాద్ జైలులో ఉన్నాడు.
పవిత్ర స్థలాల్లో ఇలాంటి రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
దర్శి : భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా తెలుకుట్ల వెంకట యాదవ్ను నియమించారు.
క్షేత్రస్థాయిలో వెంకట యాదవ్‌కు ఉన్న పట్టు, యువతలో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించిన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నియామకంపై వెంకట యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో యువతను చైతన్యవంతం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత కడియాల వెంకటేశ్వరరావు
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్తను అరెస్టు చేయించిన ఘటనను గుర్తు చేసిన టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు,
నేడు అదే తరహా వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై జరిగితే, అంబటి రాంబాబును పరామర్శించడమే సరైనదా? అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదేనా మీ రాజకీయ సంస్కారం? ఇదేనా మీ రాజకీయ విధానం? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కడియాల వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రెడ్డి నగర్–బసాపురం రోడ్డుకు నిధులు: పవన్ కళ్యాణ్ వేగమే ప్రత్యేకం
రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు–పవన్–లోకేష్ కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని Dr. లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గంలో 19 నెలల్లో దాదాపు రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు.
తరువాత లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన Dr. లక్ష్మీ.
కార్యక్రమంలో టిడిపి–జనసేన–బిజెపి నాయకులు పాల్గొన్నారు.
ఉల్లగల్లులో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 274 డ్వాక్రా మహిళా సంఘాలకు ₹27 కోట్లు రుణాన్ని ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా శక్తికరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మహిళలు స్వయం సంస్కరణలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడంలో ఈ రుణాలు కీలకంగా ఉపయోగపడతాయని కార్యక్రమంలో స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ధన్యవాదాలు తెలిపారు.
దర్శి, జనవరి 17: దర్శి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారు. ఉదయం 10.30కి దర్శిలో రూ.4 కోట్లతో కొత్త విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి భూమిపూజ, 11.15కి ఉల్లగల్లు లో రూ.3.90 కోట్లతో 33/11 కేవి సబ్‌స్టేషన్ శంఖుస్థాపన జరుగుతుంది. 11.45కి కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ, 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటలకు పసుపుగళ్లలో బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. మీడియా సోదరులు కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేయాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు.
ఉల్లగల్లో మహిళా శక్తికి కొత్త అధ్యాయం – జన్ శిక్షణ సేవా సంస్థాన్ టైలరింగ్ కోర్స్ ముగింపు
ఉల్లగల్లు, ప్రకాశం జిల్లా:
జన్ శిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహించిన టైలరింగ్ కోర్సు ఈరోజుతో విజయవంతంగా పూర్తైంది. ఈ కోర్సులో పాల్గొన్న 20 మంది మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించి, స్వయం ఉపాధికి దారి తెరిచారు.
ట్రైనర్ ప్రసన్న మాట్లాడుతూ, “ఈ కోర్సు ద్వారా మహిళలు స్వంతంగా ఉపాధి పొందే సామర్థ్యం పెరిగింది. ఇంటి వద్దే టైలరింగ్ ప్రారంభించవచ్చు, చిన్న స్థాయిలో బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టొచ్చు” అని తెలిపారు.
కార్యక్రమ ముగింపు సందర్భంగా ట్రైనర్ ప్రసన్నకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక మహిళలు, సంస్థ ప్రతినిధులు సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉల్లగల్లు కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన భూలక్ష్మిని కూడా మహిళలు ప్రశంసిస్తూ సన్మానించారు.
ప్రకాశం జిల్లా – దర్శిలో కార్డన్ & సెర్చ్, 67 బైక్‌లు స్వాధీనం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం పోలీసులు అకస్మికంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.
మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, దర్శి డిఎస్పి బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. సీఐలు, ఎస్సైలు సహా 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.
తరువాత “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, యువత, ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి–డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర గల నాగూర్ మీరావలి దర్గా వద్ద గంధ మహోత్సవం రేపు భక్తి పూర్వకంగా జరగనుంది. గత సంవత్సరం పునఃప్రారంభించిన ఈ వేడుక ఈ ఏడాది రెండవ గంధ మహోత్సవంగా జరుగుతోంది.
పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు ఉదయం 10 గంటలకు 10,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిస్తే పోలియోను పూర్తిగా నిర్మూలించవచ్చని ఐఆర్సీయస్ ఎగ్జిక్యూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. దరిశి గడియార స్తంభం సెంటర్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 11 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఒంగోలులో గంజాయి కట్టడి: రైలులో 7 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు: గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లిని సత్కరించిన సయ్యద్ మెహతాజ్ బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జనాబ్ ఫారూక్ షూబ్లి గారిని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉర్దూ భాషాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఉర్దూ భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు రూ.82,36,297 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ శనివారం తన నివాసం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో పాటు పార్టీ నేతలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్‌గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్‌లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చాకచక్యంగా దొంగతనం కేసు ఛేదన – నిందితుల అరెస్ట్, భారీ రికవరీ
ఒంగోలు పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన దొంగతనం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.20.20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
2025 నవంబర్ 27న పెళ్లి వేడుకల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 158 గ్రాముల బంగారు నగలు, నగదుతో ఉన్న బ్యాగ్‌ను దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సీఐ టి. విజయ కృష్ణ నేతృత్వంలో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ జిల్లా సాన్సి నివాసి గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితులు మరియు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
నితీష్ కుమార్ చర్యలకు నిరసనగా ఒంగోలులో ఎస్‌డీపీఐ ఆందోళన
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదాస్పద చర్యలకు వ్యతిరేకంగా సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్డులోని పోతురాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, ఆయుష్ విద్యార్థికి పత్రాలు అందజేస్తూ మహిళా డాక్టర్ మాస్క్‌ను లాగడం అనుచితమని విమర్శించారు. ప్రజాప్రతినిధుల విలువలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, నితీష్ కుమార్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజావలి, ఖాసిం, లతీఫ్, నసీమ, షాహీన తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు భద్రం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో నిర్వహించిన పవర్ సేవింగ్ అవగాహన ర్యాలీలో టిడిపి దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని, అవసరానికి మించి విద్యుత్ వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. సహజ వనరులు, ఇంధనం, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైందని తెలిపారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుతూ సోలార్ విద్యుత్ వైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, సేకరించిన సంతకాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు.
కోటి సంతకాల పత్రాల తరలింపులో భాగంగా ఒంగోలులో వైసీసీపీ ర్యాలీ
కోటి సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మణంద రెడ్డి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు , కె. నాగార్జున రెడ్డి ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి , కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డా. గొట్టిపాటి లక్ష్మీని కలిసిన గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి
నరసరావుపేట: నేడు నరసరావుపేటలోని డా. గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్ర ని శాలువాతో సత్కరించి, గ్రంథాలయం చైర్మన్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
5 తరాలకు సలహాలు ఇస్తున్న శతాధిక వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ
దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గొంగటి వెంకట సుబ్బమ్మను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కొంతసేపు ముచ్చటించి, వారి దీర్ఘాయుష్షుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, సహజ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కూడా తనపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పట్టణ జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
40 మంది రక్తసంబంధీకులతో, ఐదు తరాల మనవళ్లు–మునిమనవరాళ్లతో కలిసి జీవించడం దేవుడిచ్చిన వరమని, ఈ వయసులోనూ సరదాగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వెంకట సుబ్బమ్మ జీవన విధానం నేటి తరాలకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. పల్లె జీవన విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.
దర్శి టౌన్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిఐ వై. రామారావు, ఎస్ఐ మురళి మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని షాపుల వద్ద, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశం ఇచ్చారు.
షాపుల్లో హెల్మెట్ అవగాహన స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు.
హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి సిఐ రామారావు స్వయంగా అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువ. అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రోడ్డు భద్రత పాటించాలి అన్నారు.
ప్రజల కోసం పోరాడే నాయకత్వం. డా||లక్ష్మీ పట్టుదలకి ప్రభుత్వ స్పందన
దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి అనేది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లక్ష్యం. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పని చేసే అసలైన నాయకత్వం మళ్లీ నిరూపించారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు చివరకు శాశ్వత పరిష్కారం వచ్చింది. గ్రామాల మధ్య రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన డాక్టర్ లక్ష్మీ —ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు.
పల్లె పండుగ 2.0 లో భాగంగా ప్రభుత్వం వెంటనే స్పందించి 10.17 కోట్ల రూపాయలతో 20.92 KM రోడ్లు దర్శికి మంజూరు చేసింది.
ఆమోదం పొందిన ప్రధాన రహదారులు: 1️⃣ మారెళ్ల – నూజళ్లపల్లి – బట్లపల్లి : ₹4.14 కోట్లు
2️⃣ పెద్ద ఉల్లగల్లు – సింగన్నపాలెం : ₹4.05 కోట్లు
3️⃣ దొనకొండ – గజ్జలకొండ వయా ఇండ్లచెరువు : ₹1.98 కోట్లు
ఈ రోడ్లు పూర్తయితే దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులు–విద్యార్థులు–రోగులు ఇక మట్టిబాటల ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. దర్శి అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ముందడుగు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై అరెస్ట్‌లను ఖండించిన గులాం రసూల్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన రాష్ట్ర విద్యాధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి-పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
కర్నూలు: కర్నూలుకు చెందిన మహమూద్ పీర్ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయం కి విచ్చేసి, ఫరూక్ షుబ్లీ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రెండు వ్యక్తులు విభిన్న విషయాలను చర్చించగా, ఫరూక్ షుబ్లీ ఈ వినతి పత్రం విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారనే తెలిపారు.
వారసత్వ మసీదులను కాపాడడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్‌డిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6ను దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో గోరంట్ల సర్కిల్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 6 భారత చరిత్రలో రెండు విషాద సంఘటనల రోజు అని చెప్పారు.
అదే రోజు భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరివాణం
బాబ్రీ మసీదు ధ్వంసం… భారత వారసత్వానికి మిగిల్చిన నెగెటివ్ ముద్ర
భారతీయులమనుకుంటూ మైనార్టీలపై గుంపు దాడులు, ప్రార్ధనా స్థలాలపై దాడులు, మహిళలను అవమానించటం… ఇలా ప్రజాస్వామ్యాన్ని ఛేదించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు.
ప్రజలు ఆకలి, నిరుద్యోగంతో ఆందోళన చెందుతుంటే… కోట్ల రూపాయలు విగ్రహాలు, ఆలయాలకు ఖర్చు చేస్తూ మత పేరుతో మూఢనమ్మకాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
వక్ఫ్ సవరణలపైనా ఆయన మండిపడ్డారు.
సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా ఉమ్మీద్ యాప్‌కు గడువు పెట్టడం అన్యాయమని… ముస్లింలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. వక్ఫ్ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
అబ్దుల్ సత్తార్ చేసిన ప్రధాన డిమాండ్లు:
ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ముస్లింల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. వక్ఫ్ ఉమ్మీద్ యాప్ గడువు పొడగించాలి.
ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా కార్మిక నాయకులు పఠాన్ సాజిద్ ఖాన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖాజా వలి, బ్రాంచ్ అధ్యక్షులు షఫీగని, అబ్దుల్ రజాక్, ఖాదర్ భాషా, మహమ్మద్ సాధ్ తదితరులు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గంలోని దొనకొండను కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో కలపాలని డిబిహెచ్‌పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఏ పనికైనా ఒంగోలుకు 90 కిమీ ప్రయాణం చేయాల్సి వస్తోందని, మార్కాపురం 30 కిమీ దూరంలో ఉండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
దొనకొండ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలకు దిగుతామని సుజాత హెచ్చరించారు.
అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల కోసం సైకిళ్ల అందజేయడంలో సహకరించిన NREDCAP మరియు ASSIST సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దూరప్రాంతాల్లోని విద్యార్థులు ప్రయాణ సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో, ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో 5,300 మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేశాము.
తేజస్వి పొడపాటి ఆహ్వానంతో ద్వి కుటుంబ తేనిటీ విందు
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి ప్రత్యేక ఆహ్వానంతో, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు లలిత్ సాగర్ దంపతులు సోమవారం సాయంత్రం ఒంగోలు నివాసంలో తేనిటీ విందులో పాల్గొన్నారు. రెండు కుటుంబాలు స్నేహపూర్వక వాతావరణంలో ఆనందంగా గడిపారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో, త్రిపురాంతకం సీఐ అస్సన్ పర్యవేక్షణలో కురిచేడు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ జరిగింది.
స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, ఆయుధాల నిర్వహణ, శుభ్రత, స్టాఫ్ పనితీరును పరిశీలించిన అధికారులు — పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని, ప్రజలతో మరింత సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.
స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉర్దూ భాషాభివృద్ధికి సహకారం అందించాలని కోరగా, భాషకు మతాలతో సంబంధం లేదు… ఉర్దూ అభివృద్ధికి తప్పకుండా తోడ్పాటునిస్తాం అని మాధవ్ హామీ ఇచ్చారు.