ఛాంపియన్స్ ట్రోఫీ 2025... ఈరోజు బంగ్లాతో తలపడే టీమిండియా జట్టు ఇదేనా?
బంగ్లాదేశ్ తో జరిగే భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
అతడిని ఎక్కువ రోజులు సైలెంట్‌గా ఉంచలేరు.. రోహిత్‌పై సూర్య, పాండ్యా, యువీ ప్రశంసలు!
కటక్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 76 బంతుల్లో సెంచరీ బాదిన అతడు.. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
ఈ క్రమంలోనే అతనిపై తోటి ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు.
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వహణకు దాయాది దేశం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అదే స్టేడియంలో శుక్రవారం నాడు తమ జట్టు కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది.
వరల్డ్ రికార్డు ముంగిట మహమ్మద్ షమీ.. మరో 5 వికెట్లు తీస్తే చాలు..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న ఆతిథ్య భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.
అయితే, ఈ మ్యాచ్ కు ముందు షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ... నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టగలిగితే, అతను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డును సమం చేస్తాడు.
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ద్వారా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. ఈ ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్లు తీసిన అతడు.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు. 33 ఏళ్ల భారత స్పిన్నర్ ఈ సిరీస్ చివరి గేమ్‌లో 25 పరుగులిచ్చి, 2 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు మ్యాచుల సిరీస్‌లో 14 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
రంజీల్లో కోహ్లీ... రోజుకు పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు!
అసలు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అతనికి రోజుకు రూ. 60 వేల పారితోషికం ఉంటుంది. అంటే... మ్యాచ్ జరిగే నాలుగు రోజులకు కలిపి రూ. 2.40 లక్షలు పారితోషికంగా లభిస్తుంది. కాగా, ఎవరైనా ప్లేయర్ రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60 వేలు జీతంగా అందుకుంటాడు.
నాగాయలంక: విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి
విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం నాగాయలంక మండలం తలగడదీవిలో కృష్ణాజిల్లా సెకండరీ స్కూల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 84వ గ్రీగ్ మెమోరియల్ అవనిగడ్డ సబ్జోన్ బాలుర ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరిగింది. ఉత్తమ ప్రతిభావంతులు కావడంతో పాటు క్రీడల్లోనూ జాతీయస్థాయికి ఎదగాలని కోరారు.