

No.1 Short News
Newsreadదర్శి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తో చర్చించిన గొట్టిపాటి లక్ష్మీ, సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు
ఈరోజు బాపట్ల జిల్లా, చినగంజాం మండలం, గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర విధ్యుత్ శాఖా మాత్యులు గొట్టిపాటి రవికుమార్ తో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఈసందర్బంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్న కాంటీన్ ఏర్పాటు, రోడ్లు విస్తరణ పనులు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడం తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా దొనకొండలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
View More
Latest News
01 Apr 2025 18:55 PM


No.1 Short News
Newsreadఅనుకోని అతిథిలా షెహన్ షా ఇంటికి మంత్రి లోకేష్
షెహన్ షా మంగళగిరి పట్టణంలో ఒక సాధారణ మైనారిటీ కార్యకర్త. పసుపు జెండానే ఆయనకు సర్వస్వం. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి లోకేష్ కార్యక్రమం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి, ఉడత భక్తిగా తాను చేయదగిన సేవ చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన పని తాను చేసుకు పోతుంటాడు. రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేష్ తన ఇంటికి వస్తారని ఆయన ఊహించలేదు. అనుకోని అతిధిలా లోకేష్ వారి ఇంటికి వెల్లే సరికి షెహన్ షాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. వాస్తవానికి షహేన్షా ఇంటిలో ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. అప్పటికప్పుడు తమ ఇంటిలో ఉన్న దుప్పట్లతో కవర్ చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం షెహన్ షా కుటుంబ సభ్యులు ప్రేమతో పెట్టిన పండ్లు పలహారాన్ని స్వీకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రేమ, ఆప్యాయత తప్ప ఎటువంటి హంగు ఆర్భాటాలు లేవు. మీడియాకు సైతం లోకేష్ వారి ఇంటికి వెళ్తున్న సమాచారం లేదు. షెహన్ షా కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇంటికి వెళ్లిన చందంగా ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వెళ్లి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. కార్యకర్తకు లోకేష్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలదా?
View More
Latest News
01 Apr 2025 06:16 AM


No.1 Short News
Newsreadవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బలోపేతానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీ సీఎండీ, అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్చార్జ్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ, ఎస్కే వర్మ, ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు.
View More
Latest News
31 Mar 2025 21:43 PM


No.1 Short News
Reporter Suhelకడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
View More
Local Updates
31 Mar 2025 21:09 PM


No.1 Short News
Newsreadదర్శి: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కడియాల లలిత్ సాగర్
రంజాన్ సందర్భంగా కురిచేడు రోడ్డులోని ఈద్గా మైదానం వద్ద శనివారం జరిగిన నవాజ్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొని మాట్లాడారు. మైనార్టీల అభివృద్దే ద్వేయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారని మైనార్టీల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ కడియాల లలిత్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వపరంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈద్గా అభివృద్ధికి అవసరమైన ప్లాట్ ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా 2 లక్షల విరాళంగా ప్రకటించారు గతంలో కూడా మసీదు అభివృద్ధికి ముస్లిం సోదరులు కోరిక మేరకు 7,86,000 ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా షాదీ ఖానా ఏర్పాటు మసీదును పూర్తి చేయడం ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా నగర పాలక పంచాయతి నుండి నిధులు మంజూరు చేపిస్తానని డాక్టర్ లలిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మైనార్టీలకు తగిన గుర్తింపుని ఇచ్చి ఆదరిస్తామని నామినేట్ పోస్టులు భర్తీలో కూడా వారికి ప్రాధాన్యతనిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హామీ ఇచ్చారు. ప్రకటించిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని అక్కడికక్కడే ముస్లిం పెద్దలకు అందజేసారు. రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం నమాజ్ కార్యక్రమం లో పాల్గొన్న శుభ సందర్బంగా ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అందరు డాక్టర్ కడియాల లలిత సాగర్ ని సత్కరించారు. డా|| లలిత్ రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం లో ముస్లిం పెద్దలను సత్కారించి నూతన వస్త్రాలు అందజేశారు.
View More
Latest News
31 Mar 2025 12:37 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ శ్రీనిత్య చెరుకు రసం బీర్కూర్ తరుపున ...
బీర్కూర్ మండల ప్రజలకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు , తెలియజేసిన వారు , శ్రీ నిత్య చెరుకు రసం సెంటర్ , పాత ఇండియా నెం,1 ఏటీఎం దెగ్గర , బీర్కూర్ . ఫోన్ : 9491468100
View More
Latest News
30 Mar 2025 12:54 PM


No.1 Short News
Newsreadదర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
View More
Local Updates
26 Mar 2025 08:11 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుALERT: ప్రకాశం జిల్లాకు వర్ష సూచన
ప్రకాశం జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాతో పాటు అల్లూరి, మన్యం YSR, నంద్యాల, పల్నాడు (D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
View More
Latest News
21 Mar 2025 08:22 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!
ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
View More
Sports News
21 Mar 2025 08:20 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం
తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం
బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఏప్రిల్ 2020 సమయంలో దేశం ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజల కు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజల కు 5 ఏళ్ల నుంచి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిరు దేశం లో 80 కోట్ల మంది కి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ షాపుల్లో పెట్టక పోవడం దూరదృష్ట కారణమైన చర్య బీర్కుర్ మండలo లో ఉన్న ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంచాలి అని స్థానిక తహసీల్దార్ లత కుమారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయి కిరణ్ మండల ప్రధాన కార్యదర్శి లు మల్లె యోగేష్, బొంత లా శ్రీనివాస్ BJYM మండల ప్రెసిడెంట్ కొట్టే వినేష్, SC మోర్చా మండల ప్రెసిడెంట్ మేత్రీ సాయిలు బిజెపి సీనియర్ నాయకులు హాన్మాన్డ్లు, సాయి బాబా, కార్యకర్తలు వడ్ల బస్వరాజు, పండారి, ఆవారి శంకర్ పాల్గొన్నారు
View More
Latest News
20 Mar 2025 19:09 PM


No.1 Short News
Newsreadబోలికొండ్రాయ స్వామి తిరుణాల మహోత్సవ వేడుకలు
కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం శ్రీ ప్రసన్నఆంజనేయ తిరుణాల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ తిరుణాల పడమర నాయుడుపాలెం, ఆవులమంద, కల్లూరు కు చెందిన మూడు గ్రామాల ప్రజలు ఈ తిరుణాల వైభావంగా జరుపుకుంటారు ఈ నెల 19 వ తారీకు నాడు తిరుణాల అంకురార్పణ కార్యక్రమం ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలాగే సాయంత్రానికి 7 ఎలక్ట్రికల్ ప్రభలు 2 కోలాటం ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ వారు తెలిపినారు
View More
Latest News
20 Mar 2025 10:48 AM


No.1 Short News
Newsreadజిల్లా ఎస్పీ కి అత్యాధునిక డ్రోన్ కెమెరా అందచేసిన ఆవులమంద వాసి
ప్రకాశం జిల్లా, కురిచేడు మండలం ఆవుల మంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ గారికి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను అందజేసినారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సామాజిక బాధ్యత, సేవ స్ఫూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించటం అభినందనీయమని కొనియాడారు ఆ డ్రోన్ ను త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. అస్సన్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం సీనియర్ నాయకులు పడమర గంగారంమాజీ సర్పంచ్ దాసరి.ఏడుకొండలు, బోనపల్లి మాజీ సర్పంచ్ వి. వెంకటేశ్వర్లు, మాజీ డీలర్ గొట్టిపాటి. రామయ్య, కొలిశెట్టి కాశి పాల్గొన్నారు
View More
Latest News
19 Mar 2025 09:48 AM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుటీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM


No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM
You are offline
Please check your internet connection.
Close