Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరం సర్పంచికి రూ.5,00,000 అందజేత
తూర్పు గంగవరం సర్పంచ్ నాగమణి భర్త సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీడీపీ సభ్యత్వం కలిగిన సుధాకర్కు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ రూ.5,00,000 చెక్ను శుక్రవారం సర్పంచ్ నాగమణికి అందించారు. అలాగే తన పిల్లలకి తోడుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (చందన), ఉప సర్పంచ్ యత్తపు కాశిరెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
25 Apr 2025 11:57 AM
1
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరంలో ముస్లింల ప్రచారం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:21 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బంద్
తాళ్లూరు మండలంలో వైన్ షాపులు బుధవారం బంద్ నిర్వహించినట్లు వైన్స్ సిండికేట్ సభ్యులు తెలిపారు. సిండికేట్ సభ్యుల కథనం మేరకు.. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన హత్యకు నిరసనగా మద్యం షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. అలానే హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
బొద్దికూరపాడు విద్యార్థికి 570 మార్కులు
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. 600కు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల మండల టాపర్గా నిలిచాడు. టీచర్లు అతడిని అభినందించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
8
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM
వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. 'నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా' అని సీఎం హెచ్చరించారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
9
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'నీటితొట్టెలను వేగంగా పూర్తి చేయాలి'
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న నీటితొట్టెలను APD లలిత కుమారి పరిశీలించారు. 16 పంచాయతీల్లో 6 నీటితొట్టెలు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో FAS, TAS, BFT, ECలు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Apr 2025 23:20 PM
0
8
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన దర్శి.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
View More
Local Updates
23 Apr 2025 21:18 PM
1
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు..
హయి ఫ్రెండ్స్... నా పేరు ఉదయ్ కుమార్... వీడియోగ్రాఫర్ 2... 16 ໖໖ 2025 ໖ 09:45 10:45 సమయం లో ఒంగోలు లోని కర్నూల్ రోడ్డు నందు గల కూరపాటి కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన నా బైక్ AP 39SC 4664 నెంబర్ గల పాల్సార్ 125cc రెడ్ కలర్ బైక్ ను దొంగతనం చేశారు... రెడ్ అండ్ బ్లాక్ కలర్ సిట్... హెడ్ లైట్ మీద UKCaptures అని మరియు లోగో.... బ్యాక్ సిట్ సైడ్ డోము ల మీద UKCaptures అని స్టిక్కర్లు వుంటాయి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఎవరైనా చూస్తే దయచేసి నాకూ తెలియ చేయమని కోరుతున్నారు మీ ఉదయ్ కుమార్ 9652020050 ఒంగోలు
View More
Local Updates
22 Apr 2025 20:29 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
అమెరికాలో కుంద్రురు యువకుడు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రుకి చెందిన బోడేపూడి రాజబాబు కుమారుడు అవినాశ్ అమెరికాలో మృతి చెందాడు. ఏప్రిల్ 13న అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్తో అవినాశ్ మరణించాడు. ప్రస్తుతం వారి కుటుంబం గుంటూరులో ఉంటుండగా.. శనివారం మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకువచ్చి గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా అవినాశ్కు నెల క్రితమే వివాహమైంది.
View More
Local Updates
21 Apr 2025 17:02 PM
0
15
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
మే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు. చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
View More
Local Updates
20 Apr 2025 17:14 PM
2
19
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు రానున్న సినీనటి హెబ్బా పటేల్
తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ జాతర తిరునాళ్ల సోమవారం జరగనుంది. ఈ వేడుకలకు తాను హాజరు అవుతున్నట్లు సినీ నటి హెబ్బా పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
View More
Local Updates
14 Apr 2025 14:57 PM
0
11
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
గుంటి గంగమ్మకు బూచేపల్లి ప్రత్యేక పూజలు
తూర్పు గంగవరం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ గుడిలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి టెంకాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కార్య క్రమంలో EX ఎంపీపీ పోశం సుధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
14 Apr 2025 14:57 PM
0
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
View More
Local Updates
07 Apr 2025 12:06 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో ఇళ్లను పరిశీలించిన DHH
గత ప్రభుత్వంలో నిర్మాణ దిశలో ఆగిపోయిన ఇళ్లను గురువారం జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు SC, BC సామాజిక వర్గాలకు రూ.50వేలు, ST సామాజిక వర్గానికి రూ.75వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ 1లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:23 AM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ముండ్లమూరులో పేకాట రాయులు అరెస్ట్
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముండ్లమూరు పోలీసులు గురువారం ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గ్రామాలలో ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:23 AM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో రీ సర్వే అవగాహన ర్యాలీ
తాళ్లూరు మండలంలోని విఠలాపురం, బెల్లంకొండ వారి పాలెం గ్రామాలలో రీ సర్వే అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం కలిగిన ప్రతి రైతు సహకరించాలని తహశీల్దార్ సంజీవరావు కోరారు. అలాగే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డీటీ ప్రశాంత్, మండల సర్వేర్ అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:22 AM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చీమకుర్తి : ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జైలు
చీమకుర్తి - గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
View More
Local Updates
04 Apr 2025 11:22 AM
0
10
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ఒంగోలులో జాతీయ ఆరోగ్య పథకాలపై సమీక్ష
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలను అందించాలని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలను సకాలంలో వేయాలని సూచించారు. వేసవిలో వడదెబ్బ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
View More
Local Updates
04 Apr 2025 11:21 AM
0
8
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
View More
Local Updates
03 Apr 2025 20:45 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు మండల ఆఫీసును విజిట్ చేసిన DHH
తాళ్లూరు మండలంలో గురువారం DHH శ్రీనివాస ప్రసాద్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వివిధ దశలో ఉన్న హౌసింగ్ అదనపు సాయం గురించి చర్చించారు. అలాగే గ్రామంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మార వెంకారెడ్డి పాల్గొన్నారు.
View More
Local Updates
03 Apr 2025 17:54 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తూర్పు గంగవరం పవర్ స్టేషన్ పనులను పరిశీలించిన అధికారులు
తూర్పు గంగవరంలోని నిర్మాణ భాగంలో ఉన్న 132/33 KV పవర్ స్టేషన్ను బుధవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరిగే విధానాన్ని, పవర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే నిర్మాణానికి నాణ్యమైన మెటీరియల్ వాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SE k. వెంకటేశ్వర్లు, EE P. శ్రీనివాసులు, AE V. శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
03 Apr 2025 17:54 PM
0
13
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
తాళ్లూరు మండల కేంద్రంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరులో ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు అంతరాయం ఉంటుందని చెప్పారు. కావున వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ సహకరించాలని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు కోరారు.
View More
Local Updates
03 Apr 2025 17:25 PM
1
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ముండ్లమూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ముండ్లమూరు - తాళ్లూరు రహదారిలోని శ్రీరామ్ మిల్క్ డైరీ వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని సైడ్ కాలవలో స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
View More
Local Updates
02 Apr 2025 21:13 PM
1
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
వెలుగువారిపాలెంలో పశువుల నీటి తొట్లు నిర్మాణం
తాళ్లూరు మండలంలోని వెలుగురిపాలెం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వేసవికాలంలో నీటికి కొరత లేకుండా చూడడమే లక్ష్యమని MPDO దారా హన్మంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, శ్యాగం కొండారెడ్డి, MPP తాటికొండ శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
02 Apr 2025 12:35 PM
1
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం: పింఛన్ నగదు మాయం
పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.
View More
Local Updates
02 Apr 2025 12:35 PM
1
14
Newsread Image

No.1 Short News

Reporter Suhel
కడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
View More
Local Updates
31 Mar 2025 21:09 PM
3
36
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
తూర్పు గంగవరం: ముస్లిం సోదరులతో ఈద్గా మైదానం లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామములో రంజాన్ సందర్భంగా ఈద్గా లో నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు.
View More
Local Updates
31 Mar 2025 12:59 PM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
వేముల: భక్తి శ్రద్ధలతో ముగిసిన రంజాన్
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామం లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు, ఈ కార్యక్రమంలో వేముల గ్రామం లోని పిల్లలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
View More
Local Updates
31 Mar 2025 11:12 AM
3
108
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
నేటి ముఖ్యాంశాలు
* సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ * సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదే : ఉత్తమ్ * దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర: బండి * AP: పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు * రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నేను CBNకు మద్దతిచ్చా: పవన్ * SRHకు వరుసగా రెండో ఓటమి
View More
Local Updates
31 Mar 2025 10:24 AM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి పట్టణ మరియు మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మీ “ప్రజాదర్బార్‌”
దర్శి నియోజకవర్గం, మండల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు, దర్శి పట్టణం చౌటపాలెం రోడ్డులోని ఆర్ అండ్ బీ బంగ్లా ప్రాంగణంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ప్రజాదర్బార్. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ,సమస్యలు ఉన్నవారు నేరుగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని కలసి సమస్యలు వివరించవచ్చు, అని తెలియజేశారు
View More
Local Updates
26 Mar 2025 08:11 AM
0
31
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరులో పేకాట శిబిరంపై దాడులు
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రావడంతో, ముండ్లమూరు ఎస్సై నాగరాజు తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
View More
Local Updates
25 Mar 2025 04:01 AM
3
40
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరు: 'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'
తూర్పు గంగవరంలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా SI మల్లికార్జునరావు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. సెల్ఫోన్, అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
45
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన EE
తాళ్లూరు మండలం కొరపాటివారిపాలెంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పంచాయతీరాజ్ EE కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 58 పనులకు 3 కోట్లు మంజూరు కాగా 53 పనులు లు పూర్తయ్యాన్నారు. అలానే నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల AE వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
View More
Local Updates
21 Mar 2025 08:21 AM
0
35
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తాళ్లూరులో అగ్ని ప్రమాదం.. రైతుకు రూ.8 లక్షలు నష్టం
తాళ్లూరు గ్రామంలో ఎడమ కంటి నాగిరెడ్డికి చెందిన పొగాకు బ్యార్ని ప్రమాదవశాత్తు బుధవారం తెల్లవారు జామున దగ్ధం అయింది. పొగగొట్టంపై పొగాకు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని రైతు తెలిపారు. దాదాపు 1200 పొగాకు కర్రలు రూ.8 లక్షల నష్టం వచ్చినట్లు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.
View More
Local Updates
21 Mar 2025 08:20 AM
0
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
చీమకుర్తిలో అక్రమ గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ప్రజలు
చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామ కొండ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. బెంగళూరు-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్ తీసుకోవాలని వెళ్తున్న లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కొండను త్రవ్వటం వల్ల వర్షాకాలంలో కొండపై నుంచి వర్షపు నీళ్లు గ్రామ చెరువుకు అందుతుందని గ్రావెల్ తవ్వకాలును ఆపాలన్నారు.
View More
Local Updates
19 Mar 2025 09:47 AM
0
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
మేదరమెట్లకు బయలదేరిన వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయలుదేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహానికి జగన్ నివాళులు అర్పించనున్నారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
View More
Local Updates
18 Mar 2025 13:20 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View More
Local Updates
18 Mar 2025 13:19 PM
2
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.
View More
Local Updates
18 Mar 2025 10:35 AM
0
12
Newsread Image

No.1 Short News

Newsread
పడమర లక్ష్మీపురంలో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దొనకొండ మండలం, పడమర లక్ష్మీపురం గ్రామంలో పోలేరమ్మ తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం మరియు పడమర లక్ష్మీపురంలో గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
17 Mar 2025 19:22 PM
2
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
జరుగుమల్లి: నాలుగు పొగాకు బ్యారన్లు దగ్ధం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని రామచంద్రపురంలో సోమవారం ప్రమాదవశాత్తు పక్క పక్కనే ఉన్న 4 పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వెంకటరావు, ఆదిలక్ష్మి, ఆదేమ్మ, మాలకొండయ్య, శ్రీనివాసరావు, మురళి, రామారావు, వెంకటేశకు చెందిన బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమాచారం మేరకు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
View More
Local Updates
17 Mar 2025 17:48 PM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
మార్కాపురం: ఆస్తి తీసుకొని గెంటేశాడయ్యా!
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చాడు.
View More
Local Updates
17 Mar 2025 14:58 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
కంభం: పాత్రికేయులను దూషించిన మహిళపై కేసు.!
కంభం పట్టణంలో పాత్రికేయులను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్ మీడియాలో వారి ఫోటోలతో సహా పెట్టి దూషిస్తున్న మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగతంగా దూషించటం నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు.
View More
Local Updates
16 Mar 2025 22:34 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ప్రకాశం: హాల్ టికెట్ ఫ్రీ జర్నీ
ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో అల్ట్రా, పల్లె వెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌలభ్యం ఆర్టీసీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
View More
Local Updates
16 Mar 2025 22:32 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: దేవతి వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలోని దేవతి మహానంద సోదరులు దేవతి వరప్రసాదరావు - శ్రీమతి వసుంధర గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
View More
Local Updates
15 Mar 2025 14:43 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
View More
Local Updates
15 Mar 2025 13:02 PM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
మార్కాపురం: ప్లాస్టిక్ వాడకం ఆపాలి: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఒకసారి వాడి పడేసే ఈ ప్లాస్టిక్ వాడరాదని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వెస్తుందని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
View More
Local Updates
15 Mar 2025 12:47 PM
1
19

No.1 Short News

Newsread
దర్శి: ఇంటింటికి రెవిన్యూ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
శనివారం దర్శి పట్టణంలో 1వ వార్డ్ లో ఇంటింటికి దర్శి రెవెన్యూ కార్యక్రమం లో బాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు డా|| గొట్టిపాటి లక్ష్మీ సూచనలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు దర్శి మండల MRO శ్రవణ్ కుమార్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు రెవెన్యూ సిబ్బంది, మున్సిల్ సిబ్బంది ఉన్నారు.
View More
Local Updates
15 Mar 2025 11:26 AM
4
102
Newsread Image

No.1 Short News

జాషువా - కొండేపి రిపోర్టర్
నేతివారిపాలెంలో ఘనంగా దామచర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొండేపీ మండలం నేతివారిపాలెం గ్రామ తెదేపా నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు.
View More
Local Updates
05 Mar 2025 10:04 AM
0
28
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel