Revanth Reddy: అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది?: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని అన్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మరియు ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ,IAS స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు,IAS మరియు దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, తరువాత దేవస్థానం అతిథి గృహమునందు స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, శ్రీ ముఖేష్ కుమార్ మీనా తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, ఎక్సైజ్ శాఖ E.S లు శ్రీనివాస్, నాగమల్లేశ్వర్, డి.ఎస్.పి వాసుదేవ చౌదరి, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ఐరాల ఎమ్మార్వో, సూపర్డెంట్ వాసు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
Low Pressure: అల్పపీడనం తీరానికి దగ్గరగా వచ్చింది... మరో రెండ్రోజులు ఇవే పరిస్థితులు: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం
అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని వెల్లడించింది. తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. మరో రెండ్రోజుల పాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వివరించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, విశాఖ పోర్టులో మూడో నెంబరు సాధారణ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Seethakka: స్మగ్లింగ్ చేసే హీరోకు జాతీయ అవార్డులా?: పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు. ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.
Prakasam District: ప్రకాశం జిల్లాలో వరుసగా మూడో రోజు భూప్రకంపనలు
ఏపీలోని ప్రకాశం జిల్లాను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్లమూరులో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్రకంపనలు రావడం ఇది వరుసగా మూడో రోజు. శని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భారీ బందోబస్తుకు దూరంగా సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో తనకు భద్రత కల్పించే అంశంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సీఎం చంద్రబాబు ఆదేశం
సీఎం చంద్రబాబు ఆదేశాలతో భద్రత కుదింపు.
సీఎం చంద్రబాబు నివాసంలో డ్రోన్‍తో భద్రత పర్యవేక్షణ... ప్రజలు, కార్యకర్తలను దూరం చేసే విధంగా భద్రత ఉండొద్దని సీఎం సూచన
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి
నేడు నాలుగవ రోజు పర్యటన
ఐదేళ్ల రాక్షస పాలనకు అడ్డుకట్ట పడిందన్న భువనేశ్వరి
ప్రతి మూడు నెలలకు ఓసారి కుప్పం వస్తానని వెల్లడి
నిత్యం ప్రజల గురించే తపించే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.
Mumbai Local Train: వైరల్ వీడియో.. ముంబయి లోకల్ రైల్లో షాకింగ్ ఘటన.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వ్యక్తి నగ్నంగా ఎంట్రీ!
ముంబయిలో ఓ లోకల్ రైల్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రైల్లోని మహిళల కంపార్టుమెంట్‌లోకి ఓ వ్యక్తి పూర్తి నగ్నంగా ప్రవేశించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్‌కు వెళుతున్న రైలు మంగళవారం సాయంత్రం 4.11 గంటలకు ఘట్‌కోపర్ స్టేషన్‌లో ఆగింది. అలా ట్రైన్ స్టేషన్‌లో ఆగగానే ఓ వ్యక్తి ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కాడు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శించారు. ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
School Boy: తల్లిదండ్రులకు లేఖ రాసి హాస్టల్ నుంచి అదృశ్యమైన నెల్లూరు బాలుడు
‘మీకు నాకన్నా చెల్లి అంటేనే ఎక్కువిష్టం.. చెల్లినే బాగా చూసుకుంటున్నారు. నన్ను పట్టించుకోవడంలేదు’ అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఓ బాలుడు హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలికి చెందిన దంపతులు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడిని దేవరపాలెం గురుకుల పాఠశాల హాస్టల్ లో చేర్పించారు. కూతురును దగ్గర్లోని స్కూలుకు పంపిస్తున్నారు.
Lalu Prasad Yadav: అమిత్ షాకు పిచ్చెక్కింది.. అంబేద్కర్ వ్యాఖ్యల వివాదంపై లాలు ప్రసాద్ ఫైర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలు ఇలా విరుచుకుపడ్డారు. ‘అమిత్ షాకు పిచ్చెక్కింది. రాజకీయాలు వదిలేయాలి. వెంటనే రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
గోదాము నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయం
కేసు నుంచి బయటపడేందుకు రూ. 1.7 కోట్ల జరిమానా చెల్లించిన నాని కుటుంబం
నాని భార్య బెయిలు దరఖాస్తు గురువారానికి వాయిదా
విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసుల జారీ
Xmail: గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ రెడీ!
సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ‘ఎక్స్ మెయిల్’ పేరుతో ఈమెయిల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ‘ఎక్స్ మెయిల్’ కూడా ఉంటే బాగుంటుందన్న ఓ ఎక్స్ యూజర్ సూచన మేరకు మస్క్ ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎక్స్ మెయిల్ లాంచ్ అయితే అది నేరుగా జీమెయిల్, ఇతర ఈమెయిల్ సర్వీసులకు పోటీ ఇస్తుందని మస్క్ ఆ యూజర్‌కు సమాధానం ఇచ్చారు.
Virat Kohli: బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేసింది 3 పరుగులే.. అయినా ద్రవిడ్ రికార్డ్ బ్రేక్!
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్
టాప్ ఆర్డర్ వైఫల్యంతో 44 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్
3 పరుగులకే పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ
ఆసీస్‌పై టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లలో మూడో స్థానానికి కోహ్లీ
జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమన్న చంద్రబాబు
సంగీత ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేస్తూనే ఉంటారని వ్యాఖ్య
సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందన్న నారా లోకేశ్
ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.
KTR: వందసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు... రూపాయి ప్రయోజనం కూడా లేదు: కేటీఆర్
అసెంబ్లీలో ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజంపై చర్చించాలన్న కేటీఆర్
40 మంది కొడంగల్ రైతులను జైలుకు పంపారని మండిపాటు
సినీ నటులను జైలుకు పంపించారని ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వందసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి వచ్చారని... వీరి పర్యటనల వల్ల రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులు తీవ్ర వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
Arvind Kejriwal: ఢిల్లీ నేరాలకూ రాజధానిగా మారింది: అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీ నేరాలకు కూడా రాజధానిగా మారిందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో డ్రగ్స్ నేరాలు 350 శాతం పెరిగాయన్నారు. మహిళలపై నేరాలు, హత్యల్లో ఢిల్లీదే మొదటి స్థానమన్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయన్నారు.
మంత్రి,మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రేపు(13-12-2024 మంగళవారం ) ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో భాగంగా ప్రజల కోసం అందుబాటులో ఉంటారు.
గమనిక - ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ప్రవేశము గమనించగలరు, సహకరించగలరు.
Pushpa: ఆరు రోజుల పుష్ప-2 హిందీ వసూళ్లు ఎంతో తెలుసా?
అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప-2' ది రూల్. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కేవలం 5 రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసి, 5 రోజుల్లో అత్యంత వేగవంతంగా ఇంతటి కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
Supreme Court: వేధింపుల నుంచి రక్షణ కోసం చేసిన చట్టాన్ని కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారు: సుప్రీంకోర్టు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశించారు
కురిచేడు మండలం లో టిడిపి యువనాయకులు డాక్టర్ కలియాల లలిత్ సాగర్ జన్మదిన వేడుకలు
కురిచేడు మండల టిడిపి కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జన్మదిన వేడుకలు తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడియాల రమేష్ ముఖ్యఅతిధులు గా పాల్గొని కేక్ కట్ చేసి డా|| లలిత్ సాగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు పిడతల నేమిలయ్య, వివిద హోదాల్లో ఉన్న సీనియర్ టిడిపి నాయకులు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో గురువారం నాడు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ, సీఎం పదవి విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే... వీలైతే మరో డిప్యూటీ సీఎంగా అజిత్ వార్... ప్రస్తుతానికి ఈ సమీకరణం ప్రచారంలో ఉంది.
ఇంటికి తెచ్చిన కూరగాయల నుంచి... వండిన ఆహార పదార్థాల దాకా ఏది ఉన్నా, మిగిలినా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాం. అందులో పెడితే ఎక్కువ సమయం తాజాగా ఉంటాయనో, చెడిపోకుంటా ఉంటాయనో భావిస్తుంటాం. ఇది చాలా వరకు నిజమే అయినా... కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.