Newsread Image

No.1 Short News

Newsread
ప్రపంచ కోకో విజేత పోతిరెడ్డి శివారెడ్డికి స్వగ్రామంలో ఘన స్వాగతం
ప్రపంచ కోకో విజేత జట్టులో ఉన్న మన తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి ఈరోజు స్వగ్రామం ఈదర విచ్చేస్తున్న సందర్భంగా ఈదరలోని మిత్రులు బంధువులు గ్రామస్తులు అందరూ ర్యాలీ నిర్వహిస్తూ తప్పెట్లు తాళ మేళాలతో ఊరేగింపు చేస్తూ ఘన స్వాగతం పలికారు.
View More
Local Updates
04 Feb 2025 21:49 PM
1
11
Newsread Image

No.1 Short News

Newsread
నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ - Dr. కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు
ఈరోజు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి టౌన్ లోని 19వార్డ్ లో తిరుమల వెంకటేశ్వర్లు (బిల్లా) సోదరుడు తిరుమల నాగేంద్ర బాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం పాల్గొన్నారు. వారితో పాటు దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
View More
Local Updates
04 Feb 2025 17:11 PM
0
21
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు: రేషన్ బియ్యం పట్టివేత
ముండ్లమూరు మండలం తమ్మలూరు లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో సుమారు 70 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు ముండ్లమూరు ఎస్సై నాగరాజు తెలిపారు. వినుకొండ నుంచి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
View More
Local Updates
03 Feb 2025 19:29 PM
4
25
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా కపురం
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దర్శి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఒంగోలు గిత్తలతో, మార్కాపురం పలకలతో, బౌద్ధ స్థూపాలతో, గ్రానైట్ తో తీర ప్రాంతం తో, ఎందరో స్వతంత్ర సమరయోధులు నడిచిన నేల ప్రకాశం జిల్లా అని జిల్లా గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు.
View More
Local Updates
03 Feb 2025 18:49 PM
1
13
Newsread Image

No.1 Short News

Newsread
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో టీడీపీ జోరు మరింత పెరిగింది. తాజాగా హిందూపూర్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఈ రోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.
View More
Local Updates
03 Feb 2025 11:56 AM
3
32
Newsread Image

No.1 Short News

Newsread
పెళ్లి లో చోలీ కే పీచే పాటకు డాన్స్ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ
పెళ్లిలో డాన్స్ చేసిన వరుడు.. అది నచ్చక పెళ్లి కాన్సల్ చేసిన మామ ఢిల్లీలో ఒక పెళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చోలీకే పీఛే క్యాహై పాటకు డాన్స్ చేశాడు ఇది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని కాన్సల్ చేశాడు వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు
View More
Local Updates
03 Feb 2025 10:55 AM
1
13
Newsread Image

No.1 Short News

Newsread
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టం స్టాక్ మార్కెట్ పై బడ్జెట్ ఎఫెక్ట్
Local Updates
03 Feb 2025 10:51 AM
1
11
Newsread Image

No.1 Short News

T Mahesh
Hi
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. టీడీపీ నుంచి రమేశ్ కుమార్, వైసీపీ నుంచి లక్ష్మీ మహేశ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి చేరిన వారు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి 23 మంది సభ్యులు ఉండటంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పట్టణంలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు.
View More
Local Updates
03 Feb 2025 10:38 AM
1
10
Newsread Image

No.1 Short News

Newsread
ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
నేడు దర్శి మండలం, లంకోజనపల్లి గ్రామం లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ . వారితో పాటు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , అధికారులు మరియు వివిద హోదాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు ఉన్నారు.
View More
Local Updates
01 Feb 2025 16:55 PM
3
43
Newsread Image

No.1 Short News

Newsread
ఉత్తమ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అవార్డు గ్రహీత రవికుమార్ ను సత్కరించిన కపురం.
ప్రకాశం జిల్లా ఉత్తమ మోటారు వెహికిల్ Inspector గా, కలెక్టర్ మరియూ ఎస్పీ చేతులమీదుగా అవార్డు గ్రహీత అయిన దరిశి మోటార్ వెహికిల్ Inspector రవికుమార్ , దరిశి పురప్రముఖులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, అందరివాడు కపురం శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా అధికారుల మన్ననలుపొంది ప్రభుత్వం,ప్రజలందరి మన్ననలు,ఆశీస్సులు పొంది అవార్డును సొంతంచేసికొన్న MVI రవికుమార్ ని శాలువాతో మరియూ ఫ్లవర్ బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది.
View More
Local Updates
01 Feb 2025 16:46 PM
2
37
Newsread Image

No.1 Short News

Newsread
ఓణిలా బహుకరణ వేడుకలో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు తాళ్లూరు మండలం, బెల్లంకొండ వారిపాలెం లో శనివారం టిడిపి నాయకులు MPTC గూడా ప్రభాకర్ రెడ్డి - సరస్వతి కుమార్తె చి|| సాత్విక రెడ్డి ఓణిలా బహుకరణ కార్యక్రమం లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ డా|| కడియాల లలిత్ సాగర్ . ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల MPP తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, మండలం క్లస్టర్ లు, యూనిట్ ఇంచార్జి లు, బూత్ ఇంచార్జి లు, వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
01 Feb 2025 16:29 PM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
రామచంద్రాపురం లో పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న మారెళ్ల
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి కడియాల లలిత సాగర్ ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు..ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శి హరిత....మరియు సచివాలయ సిబ్బంది ఆదిలక్ష్మి...లావణ్య...నాయక్...రమేష్...పాల్గొన్నారు
View More
Local Updates
01 Feb 2025 15:45 PM
2
26
Newsread Image

No.1 Short News

Newsread
బాలీవుడ్ హాస్యనటుడు జానీలీవర్ తో కపురం శ్రీనివాసరెడ్డి
బాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ దర్శి లో తమ బంధువుల వివాహ కార్యక్రమం కి రావడం జరిగింది. ఈ సందర్భంగా పుర ప్రముఖులు కపురం శ్రీనివాసరెడ్డి తో ముచ్చటించారు, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సొంతగడ్డపై అనుభూతులను పంచుకున్నారు. అలాగే దర్శి గురించి ప్రత్యేకంగా చర్చించారు.
View More
Local Updates
31 Jan 2025 18:59 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్దులకు ఉపకరణాలు గుర్తింపు శిబిరం.
ఈనెల 27 నుండి 31 వరకు అలింకో సంస్థ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక శిబిరాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, లూయిస్‌ బ్రెయిలీ, ఇలా ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్ఫూర్తి ఎగసిపడుతుంది, వారంతా పట్టుదలకు మారుపేరు, కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకూ వన్నెలద్దిన వారు, సభ్య సమాజం నుంచి ఎన్ని ఈసడింపులు ఎదురైనా ఆత్మవిశ్వాసమే ఊపిరిగా అనితర సాధ్యమైన మార్గంలో పయనిస్తూ నూతన శకానికి నాంది పలికిన వారు, వికలాంగులే అయినప్పటికీ వారు కొత్త ఊపిరిలూదారు శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరుపిస్తూ ‘విభిన్న ప్రతిభావంతులు’గా నిలుస్తున్నారు అన్నారు. ఇలాంటి శిబిరాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
View More
Local Updates
31 Jan 2025 15:22 PM
1
41
Newsread Image

No.1 Short News

T Mahesh
పొలం పనుల్లో రఘువీరారెడ్డి
మంత్రి, పీసీసీ చీఫ్ గా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులైన రఘువీరారెడ్డి పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని తన పొలంలో రైతుగా మారారు. పంటలోని కలుపు మొక్కలను యంత్రంతో స్వయంగా తొలగించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయం దొరికినప్పుడు సామాన్యుడిలా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సాగించారు.
View More
Local Updates
31 Jan 2025 10:39 AM
17
244
Newsread Image

No.1 Short News

Asma
టిడిపి యువ నేత మృతి - నివాళులు అర్పించిన Dr.గొట్టిపాటి లక్ష్మీ, Dr. కడియాల లలిత్ సాగర్
చందవరం పంచాయతీ, దేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు బత్తుల వెంకటేశ్వర్లు (32) నిన్న బుధవారం దర్శి లో గుండెపోటు కు గురై మృతి చందగా..గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్ దిగ్భ్రాంతి కి గురయ్యారు.బత్తుల వెంకటేశ్వర్లు పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఓదార్చారు.
View More
Local Updates
30 Jan 2025 17:40 PM
0
42
Newsread Image

No.1 Short News

Shaida
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి నాయకులు.
దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఇరుగుల శ్రీనివాస రెడ్డి,మైనారిటీ సెల్ అధ్యక్షులు మిల్లర్ బుజ్జి,మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షులు బాబురావు,ST సెల్ అధ్యక్షులు మోహన్ బాబు.
View More
Local Updates
30 Jan 2025 15:10 PM
1
39
Newsread Image

No.1 Short News

Rasul.Sk
వ్యాపారస్తులకు ముండ్లమూరు ఎస్సై నాగరాజు సూచనలు
ప్రధాన రహదారుల పక్కన వ్యాపార సముదాయాలు నిర్వహించుకునేవారు తమ షాపుల ఎదుట సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ముండ్లమూరు ఎస్సై నాగరాజు సూచించారు. బుధవారం ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఇన్స్టాలేషన్ పై అవగాహన నిర్వహించారు. తప్పనిసరిగా ప్రతి షాప్ ఎదుట సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏవైనా అనుకోని ఘటనలు షాపుల ఎదుట జరిగిన అందులో రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.
View More
Local Updates
29 Jan 2025 21:55 PM
1
35
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ:
అంబేద్కర్ రాజ్యాంగానికి సమున్నత స్థాయి ఉందని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న మతాలు, విలక్షణ ప్రాంతాలకు నిలయమైన భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించారని తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కర్రా సుధాకర్,మేడికొండ విజయ్, డేగల రాఘవ, లుక్కా పిచ్చియ్య, కొల్లూరి ఇమ్మానియేల్, మండలి రామ్మోహనరావు, ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) గుంటూరు వినయ్, మొగల్ మురాద్ బేగ్, మెగావత్ గోపీ, కంచర్ల ఆనంద్ పాల్గొన్నారు.
View More
Local Updates
28 Jan 2025 08:52 AM
0
22
Newsread Image

No.1 Short News

P.Prakash
చల్లపల్లి :
ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం , పాగోలు లో గల ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసిన బొబ్బ గోవర్ధన్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్నారై అవనిగడ్డ నియోజకవర్గం.
View More
Local Updates
28 Jan 2025 08:52 AM
0
20
Newsread Image

No.1 Short News

P.Prakash
చల్లపల్లి:
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కి వచ్చిన నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎన్నారై బొబ్బా గోవర్ధన్, టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, చల్లపల్లి మండల నేతలు మోర్ల రాంబాబు, ముమ్మనేని నాని, యార్లగడ్డ శ్రీనివాసరావు, నిడమానూరి దిలీప్ కుమార్, మోర్ల శివ, వేమూరి రమేష్ బాబు, షేక్ నభీ ఘోరి, మేకా వెంకటేశ్వరరావు ప్రభృతులు.
View More
Local Updates
28 Jan 2025 08:52 AM
0
18
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
ముండ్లమూరులోని పోలీస్ స్టేషన్ నందు ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముండ్లమూరు స్టేషన్ ఎస్ఐ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి జీవితాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
View More
Local Updates
26 Jan 2025 14:51 PM
0
34
Newsread Image

No.1 Short News

P.Prakash
ఘంటసాల: సూర్యఘర్ పై ప్రజల్లో అవగాహన పెంచాలి
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మెప్మా పీడీ పి. సాయిబాబు సూచించారు. శనివారం ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ మూడు కిలోవాట్ల సోలార్ రుఫప్ ప్లాంట్ కెపాసిటీ ద్వారా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకోవచ్చని, రూ.78 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారావు పాల్గొన్నారు.
View More
Local Updates
26 Jan 2025 07:46 AM
1
35
Newsread Image

No.1 Short News

P.Prakash
చల్లపల్లి: రూ.4.65 లక్షలతో 241 గోకులం షెడ్లు నిర్మాణం
అవనిగడ్డ నియోజకవర్గం లో రూ.4.65 లక్షలతో 241 గోకులం షెడ్లు నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శనివారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు ఉచ్చగడ్డలో లబ్ధిదారుడు డొక్కు నాంచారయ్య ఉపాధి నిధులు రూ.2.30 లక్షలతో నిర్మించుకున్న 50 గొర్రెల గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గోకులం షెడ్ల నిర్మాణానికి ఉపాధి పథకం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
View More
Local Updates
26 Jan 2025 07:45 AM
0
32
Newsread Image

No.1 Short News

Rasul.Sk
తాళ్లూరు లో కుక్కల దాడిలో గాయపడ్డ జింక
మండలంలోని రాజానగరంలో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. అడవిలో సంచరించే జింక అనుకోకుండా గ్రామంలోకి వచ్చింది. జింకపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. స్థానికులు తాళ్లూరు పశువైద్య కేంద్రానికి తరలించారు. వెనుక భాగంలో గాయపడినట్టు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
View More
Local Updates
25 Jan 2025 21:30 PM
1
37
Newsread Image

No.1 Short News

P.Prakash
ఘంటసాల: ఘనంగా ఓటరు దినోత్సవం
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఘంటసాల మండలం తెలుగురావు పాలెం గ్రామ సచివాలయం నందు గ్రామ రెవిన్యూ అధికారి పామర్తి కోటేశ్వరరావు, బి ఎల్ ఓ కొడాలి శ్వేతా ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, మాజీ సర్పంచ్ అరుంభాకా రవి, సొసైటీ ప్రెసిడెంట్ పెద్దముతైవి, వసంతరావు సత్కరించారు ఈ కార్యక్రమంలో అచ్చంపాలెం సెక్రెటరీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
View More
Local Updates
25 Jan 2025 21:28 PM
2
40
Newsread Image

No.1 Short News

Asma
14 వ వార్డుల సమస్యల పట్ల వెంటనే స్పందించిన చైర్మన్ పిచ్చయ్య..
దర్శి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య వార్డులోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిసి రోడ్లు,సైడ్ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకున్నారు.. సైడ్ కాల్వలు,రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని అడిగిన వెంటనే ప్రతిపాదన తీసుకున్నందుకు చైర్మన్ నారాపుసెట్టి పిచ్చయ్యకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు...
View More
Local Updates
25 Jan 2025 13:58 PM
3
41
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని మంత్రికి వినతి
అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ ను కోరారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలసి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించవలసిన సౌకర్యాలపై మంత్రికి విన్నవించారు. త్వరలో సిబ్బంది నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. బిజెపి నాయకులు టీవీ. గిరి తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
25 Jan 2025 09:54 AM
0
37
Newsread Image

No.1 Short News

P.Prakash
ఘంటసాల: బౌద్ధ స్తూపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాల కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఘంటసాల లో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద ధమ్మధజ బంతేజీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు, బౌద్ధ బోధనల కరపత్రం ఆవిష్కరణ, విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ శయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందన్నారు.
View More
Local Updates
25 Jan 2025 09:54 AM
0
32
Newsread Image

No.1 Short News

P.Prakash
గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్ లో జాతీయ బాలిక దినోత్సవం
గోగినేని పాలెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది అంగనవాడి సిబ్బంది సంయుక్తంగా జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థినీల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాజంలో లింగ వివక్షత విడనాడాలని బాలురతో పాటుగా బాలికలు కూడా చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు. బాలికలు ఇబ్బందుల నుండి ఎలా రక్షణ పొందాలో వివరించారు.
View More
Local Updates
25 Jan 2025 09:54 AM
0
33
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి లో
యువగళం యువ సారధి, రథసారథి ఐటి & విద్యాశాఖ మాత్యులు, శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భం గా రోగులకు పండ్లు, రొట్టెలు పంపిని చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు NRI- ప్రముఖ పారిశ్రామికవేత శ్రీ బొబ్బా గోవర్ధన్ గారు. అధేవిధముగా గోవర్ధన్ గారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ దేశంలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలకు సంక్షేమ అనేది ఏర్పాటు చేసి విద్యకు వైద్యానికి అదేవిధంగా కార్యకర్తలు ప్రమాదవశాత్తును మరణిస్తే వారిని ఆదుకోవడానికి సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక కోటి యాభై ఐదు వేలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ 3 వ తరానికి ఒక దిక్సూచిగా నిలుస్తాడాని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ లోను ఆంధ్ర ప్రదేశ్ లోను నాయకులు ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు కడిగిన ముత్యములా యువగళం పాదయాత్ర చేసి తాను నిప్పు అని నిరుపించుకున్న యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అని ఈ సందర్భంగా తెలియచేసారు., అనంతరం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలోకొల్లూరి వెంకటేశ్వరరావు, కర్ర సుధాకర్, బచ్చు రఘునాథ్, బండే కనకదుర్గ, మండలి రామ్మోహన్రావు, విశ్వనాథపల్లి పాప, మట్ట నారాయణమ్మ, సనక అన్నపూర్ణమ్మ, సీతారావమ్మ, పరుచూరి దుర్గాప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, అన్నపురెడ్డి లక్ష్మీనారాయణ, ఘంటసాల రాజమోహన్రావు, మాదివాడ రత్నారావు, లుక్కా పిచ్చయ్య, లింగం బాబురావు, అడపా శ్రీనివాసరావు, మేడికొండ విజయ్, మెరుగు సోమిరెడ్డి, కూరాకుల ప్రసాద్, మొగల్ మొరాజ్, గుంటూరు వినయ్, చెన్ను గాంధీ, ఎలవర్తి చిన్న, కొండవీటి గోవిందు, నాగిడి రాంబాబు, బచ్చు శ్రీనివాసరావు, బచ్చు రంగారావు, కనకాల సత్యంబాబు, చెన్ను బాబురావు, చెన్ను గాంధీ, బడే సుబ్బారావు, తుంగల ఆంజనేయులు, కోట సాయి తoడు గంగాధర్, తూమాటి ప్రసాద్, బట్టు నరసింహారావు, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు..
View More
Local Updates
24 Jan 2025 21:03 PM
3
43
Newsread Image

No.1 Short News

P.Prakash
చల్లపల్లి:ఆర్టీసీ కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలి డి పి టి ఓ వాణిశ్రీ
చల్లపల్లి బస్టాండ్ లో ఆర్టీసీ కార్గో సేవలను చుట్టుపక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి. వాణిశ్రీ కోరారు. శుక్రవారం చల్లపల్లి బస్ స్టేషన్ లోని ఆర్టీసీ కార్గో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చల్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం చల్లపల్లి ఆర్టీసీ బస్టాండులో ఆర్టీసీ కార్గో, కొరియర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, వేగవంతమైన సేవలు ఆర్టీసీ కార్గో, కొరియర్ ద్వారా అందిస్తున్నమన్నారు. వ్యాపార సంస్థల యజమానులు, గ్రామ ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు.
View More
Local Updates
24 Jan 2025 21:03 PM
1
39
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ:రాష్ట్రం లో మొదటి స్థానం లో
జనవరి 23 వ తేది సభ్యత్వ నమోదు కార్యక్రమం లో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రం లో మొదటి స్థానం లో వున్న సందర్భంగ, తాడేపల్లి లోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో LED స్క్రీన్ పై పెట్టడం జరిగింది. ఇందుకు సహకరించిన కార్యకర్తలకు మరియూ సభ్యత్వం టీం కి , పార్టీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ గారు మరియు కనపర్తి శ్రీనివాసరావు గారు శుభకాంక్షలు తెలియజేసారు.
View More
Local Updates
24 Jan 2025 21:02 PM
1
32
Newsread Image

No.1 Short News

P.Prakash
కోడూరు:అంగన్వాడి సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీ కే బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.పిల్లల అడ్మిన్సును, వంటశాల మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్ ను తనిఖీ చేసి ,స్వయంగా పిల్లల వెయిట్ ను పరిశీలించారు. రిజిస్టర్లు చూపించిన పేర్లు గల పిల్లలు లేకుండా అంగన్వాడీ సెంటర్లో వేరే పిల్లలు ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
View More
Local Updates
24 Jan 2025 21:02 PM
1
28
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: నిస్సహాయ మహిళకు సర్పంచ్ ఉమా చేయూత.
షుగర్ వ్యాధితో బాధపడుతూ రెండు కాళ్లు తొలగించాల్సిన దుస్థితికి చేరిన నిర్భాగ్యురాలికి అవనిగడ్డ సర్పంచ్ గొరుముచ్చు ఉమా 5000 ఆర్థిక సహాయం అందించారు. మోపిదేవి ప్రశాంత్ నగర్ కు చెందిన కాకి నాగమణి, నివాసం వద్ద బుధవారం ఆమెను పరామర్శించి అండగా నిలిచారు, చచ్చు బడిన కాళ్ళు తొలగించేందుకు అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోరుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి తామ వంతుగా ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఉమా తెలిపారు. మానవతా దృక్పథంతో దాతలు అందిస్తున్న సహకారానికి నాగమణి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బర్త గొరుముచ్చు మోని, ఉప సర్పంచ్ కోడూరు సత్యనారాయణ, పాల్గొన్నారు.
View More
Local Updates
24 Jan 2025 21:02 PM
1
30
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: రోడ్డు ప్రమాదంలో ఎస్ టి ఓ కు గాయాలు
అవనిగడ్డ సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న ఉప్పల ఆదిశేషులకు శుక్రవారం లారీ ఢీకొని గాయాలయ్యాయి. రేపల్లెలో నివాసం ఉంటున్న అతను ఇది నిర్వహణలో భాగంగా అవనిగడ్డ వస్తుందనే పద్యంలో పులిగడ్డ పెనుమూడి వద్ద లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి ఈ విషయాన్ని సహజ ఉద్యోగులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఆయనను రేపల్లెలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
View More
Local Updates
24 Jan 2025 21:02 PM
1
30
Newsread Image

No.1 Short News

P.Prakash
కోడూరు: దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
అయ్యప్ప స్వామి దేవాలయంలో హుండీ దొంగతనం చేసిన దొంగను సీసీ కెమెరాలు పట్టించాయని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయంలోని హుండీని దొంగిలించారని ఆలయ ధర్మకర్త బడే భావన నారాయణ ఫిర్యాదు మేరకు ఆలయం వద్ద ఉన్న సిసి ఫుటేజ్ ని పరిశీలించి హుండీ దొంగిలించిన తమ్ము వీరరాఘవయ్యను పట్టుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ మసీదులు ప్రార్థన మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
View More
Local Updates
24 Jan 2025 19:57 PM
3
42
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: వివేకానంద పురస్కారం అందుకున్న బుద్ధ ప్రసాద్
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం - 2025 అందుకున్నారు అనపర్తిలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్నేయనందాజీ మహారాజ్ చేతుల మీదగా బుద్ధ ప్రసాద్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పరిజ్నేయనందాజీ మహారాజ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు.
View More
Local Updates
24 Jan 2025 19:55 PM
0
32
Newsread Image

No.1 Short News

Asma
ఉత్తమ అవార్డు సాధించి జిల్లా కే వన్నె తెచ్చిన దర్శి తహశీల్దార్ M శ్రావణ్ కుమార్
ప్రకాశం జిల్లా నుంచి ఉత్తమ AERO & తహశీల్దారుగా దర్శి తహశీల్దారు అయిన శ్రీ యం.శ్రావణ్ కుమార్ గారిని ఎంపిక చేయడం జరిగినది. సదరు ఉత్తమ AERO & తహశీల్దారు అవార్డును ఎలక్షన్ కమీషన్ వారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు గారి చేతులమీదుగా ఓటర్స్ డే సందర్భముగా తేది:25.01.2025న తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ నందు ఇవ్వనున్నారు.
View More
Local Updates
23 Jan 2025 22:14 PM
3
44
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను గురువారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదగా ఆవిష్కరించారు. అనంతరం ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈవో శ్రీరామ వరప్రసాద్ రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఫిబ్రవరి 3న కళ్యాణం 4న రథోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
View More
Local Updates
23 Jan 2025 22:13 PM
2
40
Newsread Image

No.1 Short News

P.Prakash
నాగాయలంక: ఘనంగా నేతాజీ జయంతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమం గురువారం నాగాయలంకలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం సెంటర్లో నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు లకనం నాగాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారతదేశానికి స్వాతంత్ర్యం సాధనే ధ్యాయంగా పోరాడి నేతాజీ ఆదర్శంగా నిలిచారని తహసిల్దార్ ఎం హరినాథ్ తెలిపారు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామ కుమార్, డిటి. అబ్దుల్ రఫీ, తలసీల స్వర్ణలత పాల్గొన్నారు.
View More
Local Updates
23 Jan 2025 22:13 PM
0
35
Newsread Image

No.1 Short News

P.Prakash
చల్లపల్లి: ప్రైవేట్ వైద్యశాలలను తనిఖీ చేసిన జిల్లా అధికారి
చల్లపల్లి గ్రామం నందు ఉన్నటువంటి పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్ శర్మిష్ట ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. నల్లూరి హాస్పిటల్, ప్రశాంతి హాస్పిటల్, చిన్నారి చిల్డ్రన్స్ క్లినిక్, మానస హాస్పిటల్, నందన్ క్లినిక్, మరియు ఒక ఆర్ఎంపీ క్లినిక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరైనా హాస్పటల్ రిజిస్ట్రేషన్ చేయకుండా నడిపినట్లు అయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
View More
Local Updates
23 Jan 2025 20:26 PM
1
36
Newsread Image

No.1 Short News

P.Prakash
ఘంటసాల: వాహనం ఢీకొని హోమ్ గార్డ్ యశ్వంత్ మృతి
మచిలీపట్నం పోలీస్ హెడ్ కోటర్స్ లో విధులు నిర్వహించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన ఘంటసాల మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల అందించిన వివరాలకు మేరకు చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన గొరి పర్తి యశ్వంత్ (20) ఘంటసాల శివారు జిలగల గండి కాలనీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.
View More
Local Updates
23 Jan 2025 20:13 PM
1
36
Newsread Image

No.1 Short News

Rasul.Sk
బెల్టు షాపుపై దాడి... 25 మద్యం బాటిళ్లు పట్టివేత: ఎస్ఐ నాగరాజు
మండలంలోని శంకరాపురం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుపై బుధవారం దాడి చేసిన ఎస్ఐ వై నాగరాజు పోలీస్ సిబ్బంది బెల్టు షాపుపై దాడి చేసి 25 మద్యం బాటిళ్ళుని సీజ్ చేసి కేసు నమోదు చేశారని ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మిన, మద్యం విక్రయించిన వారిపై ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది వెంకటేశ్వరరావు, మరియ బాబు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
View More
Local Updates
23 Jan 2025 09:33 AM
3
48
Newsread Image

No.1 Short News

P.Prakash
అవనిగడ్డ: స్వామి వివేకానంద పురస్కారానికి ఎంపికైన ఎమ్మెల్యే
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం- 2025 నకు ఎంపికైనట్లు ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పురస్కార ప్రధాన ఉత్సవంలో శ్రీ రామకృష్ణ మిషన్ - రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్నేయనందాజీ. మహారాజ్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదగా ఈ పురస్కారం అందుకుంటారు.
View More
Local Updates
22 Jan 2025 23:23 PM
1
40
Newsread Image

No.1 Short News

P.Prakash
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. నాగాయలంక మండలం వక్కపట్ల వారి పాలెం లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. కాలనీలో ప్రధాన రహదారి నిర్మాణం జరగక ఇబ్బంది పడుతున్నామని, రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తే గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇబ్బందులు ఉండవని సర్పంచ్ ప్రసాద్ తెలిపారు.
View More
Local Updates
22 Jan 2025 23:23 PM
0
38
Newsread Image

No.1 Short News

P.Prakash
కోడూరు: గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి
గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కోడూరు మండలం మందలపాకల నుంచి ఇరాలి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ యూనిట్ పర్యవేక్షణలో పీ.ఎం. జీ. ఎస్. వై -3 నిధులు రూ.3.88 ఓట్లతో ఐదు కిలోమీటర్లు పొడవున నిర్మిస్తున్న నూతన తారు రోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు మందపాకల నుంచి చింతకోళ్ల వరకు ఉన్న రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తామన్నారు.
View More
Local Updates
22 Jan 2025 23:05 PM
1
40
Newsread Image

No.1 Short News

P.Prakash
నాగాయలంక: ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి పనులు వేగవంతం
ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. బుధవారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఫ్లడ్ డామేజ్ రిపేర్ ఫండ్స్ రూ.7.95 లక్షలతో చేపట్టిన పనుల్లో భాగంగా భావదేవరపల్లి రెగ్యులేటర్ మందపాకల హెడ్ స్లూయీజులకు ఏర్పాటు చేసిన నూతన గేట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవన బోయిన వెంకటేశ్వరరావు, రైతులు ఉన్నారు.
View More
Local Updates
22 Jan 2025 23:05 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న దర్శి సిఐ రామారావు.
రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా దర్శి లోని అద్దంకి రోడ్డులో వాహనదారులకు దర్శి సిఐ అవగాహన కల్పించారు. అధిక లోడు తో ఆటోలో ప్రయాణించవద్దని భద్రతా నియమాలు పాటించాలని సురక్షితంగా గమ్యం చేరుకోవాలని మీకోసం ఎదురు చూసే కుటుంబ సభ్యులకు మీరే ఆధారమని, వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని దర్శి సీఐ రామారావు సూచించారు.
View More
Local Updates
22 Jan 2025 20:09 PM
1
35
Newsread Image

No.1 Short News

P.Prakash
కోడూరు: నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు
కోడూరు మండలంలోని ఇరాలి గ్రామ శివారులో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడులు జరిపి పట్టుబడ్డ నలుగురు వ్యక్తుల నుంచి రూ.8,720 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చాణిక్య తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.
View More
Local Updates
22 Jan 2025 00:07 AM
0
37
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel